2 Countries is Sunil’s last chance to score a hit at the box office. The film which is directed by N Shankar has hit the screens today. Let’s see whether Sunil gets his much needed hit or not.
Story:-
Ullaas(Sunil) is a cunning guy who can go to any extent for money. One fine day, he cheats a priest and redirects an NRI match which is supposed to go to a known person in his village. He manages everything and finally ties the knot with Laya(Manisha Raj). The twist in the tale arises when Ullaas comes to know that the NRI girl he married is a complete alcoholic. Rest of the story is as to how Sunil manages to get his problematic wife back on track.
Plus Points:-
Production values of the film are pretty good as half of the film is shot in the US. Heroine Manisha Raj makes an impressive debut as she looks quite beautiful and even performs well in her role of an NRI.
Some comedy featuring Srinivasa Reddy and Prudhvi impresses in bits and pieces. Sunil is just about okay in his role and does what is needed. The last ten minutes featuring some emotions between the lead pair have been handled well.
Minus Points:
2 Countries is a bad remake of a hit Malayalam film. Director Shankar gets it wrong right from the word go as he does not establish the story well. Things get monotonous as the outdated comedy and forced emotions start irritating you right away.
Even when the film enters the main story, the twist regarding the heroine’s character is showcased on a silly and shoddy note. The comedy is so over the top that you start thinking whether it is the same director, Shankar, who has made some meaningful films in the past.
Even in the second half when the film moves to the US, the proceedings become so cheap that you start looking at the exit doors. It is surprising to see a good actor like Naresh behave so over the top with his fake US accent.
Technical Aspects:-
Music by Gopi Sundar is just about okay. Camera work is decent and so was the production design. Dialogues were quite funny and have been written well. Editing is pathetic as at least 20 minutes of the film could have been easily cropped off. Coming to the director Shankar, it is very disappointing to see a talented director like him execute a film like 2 Countries. He has not impressed in a single department and made Sunil and the rest of the star cast look so over the top. The way he executed the story by making it quite silly has ruined the viewing for the audience completely.
Verdict:-
On the whole, 2 Countries is an over the top and silly entertainer which has nothing going its way. Halfway through this film, you start wondering as to what made Sunil accept this project when he is going through such troubled times. Bad writing, silly proceedings and over the top performances kill the film completely. All those who like to see Sunil’s style of comedy can give this film a shot. But others can stay away from this one even when it is aired on TV.
కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో ఆకట్టుకొన్న సునీల్ అందాలరాముడు అనే చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత మర్యాద రామన్న లాంటి ఘనవిజయాన్ని సొంతం చేసుకొన్నాడు. ఆ తర్వాత వరుస పరాజయాలు ఆయనను వెంటాడాయి. ఈ నేపథ్యంలో మలయాళంలో ఘనవిజయం సాధించిన 2 కంట్రీస్ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ నటించిన పాత్రను సునీల్ పోషించగా, ఎన్ శంకర్ దర్శకత్వం వహించారు. సంసారం అనే చదరంగంలో పావులుగా మారిన భార్యాభర్తల సంబంధాలు, రెండు దేశాల మధ్య వైవాహిక జీవితంలోని పరిస్థితులను ఆధారంగా చేసుకొన్న 2 కంట్రీస్ చిత్రం ఎలా ఉందని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. Popular Videos 02:37 ఈ సినిమాలో సునీల్ అన్న ను చూస్తే.. మెగా స్టార్ గ్యాంగ్ లీడర్ గుర్తొచ్చింది.. 01:38 రాజమౌళి దిమ్మతిరిగే ప్లానింగ్.. బాహుబలి తరహాలో మల్టీస్టారర్..! 01:21 నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం NTR 2 కంట్రీస్ మూవీ కథ ఉల్లాస్ కుమార్ డబ్బు కోసం ఏదైనా చేసే మనస్తత్వం. రాజకీయ నేతలను బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసేంత డబ్బు పిచ్చి. కట్నం భారీగా వస్తుందని అంగవికలురాలైన పటేల్ (షియాజీ షిండే) చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతాడు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉండే లయ (మనీషా రాజ్)తో పెళ్లి కుదరడంతో పటేల్ చెల్లెల్ని కాదంటాడు. ఉల్లాస్‌ను లయ పెళ్లి చేసుకోవడానికి ఓ బలమైన కారణం ఉంటుంది. అలా భార్యగా మారిన లయ మద్యానికి బానిస. ఆ విషయం పెళ్లి తర్వాత తెలుస్తుంది. అమెరికాకు వెళ్లిన తర్వాత ఓ కారణంగా ఉల్లాస్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్తుంది. ముగింపుకు ఇలా ఉల్లాస్, లయకు కోర్టు విడాకులు మంజూరు చేసిందా? విడాకులు తీసుకొన్న తర్వాత ఉల్లాస్ పరిస్థితి ఏమిటి? లయ ఎందుకు విడాకులు కోరింది? ఏపీలోని వెంకటాపురం అనే గ్రామంలో ఉండే ఉల్లాస్‌ను అమెరికాకు చెందిన లయ ఎందుకు పెళ్లి చేసుకొన్నది? విడాకులు తీసుకొన్న ఉల్లాస్, లయ జీవితానికి క్లైమాక్స్ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే 2 కంట్రీస్ మూవీ కథ. ఫస్టాఫ్‌లో తొలిభాగంలో సునీల్‌కు డబ్బు పిచ్చి ఎంత ఉందనే కోణాన్ని చూపించడంతో కథ ప్రారంభమవుతుంది. సునీల్ పైసల కోసం ఎంతకైనా తెగిస్తాడనే విషయాన్ని ఆవిష్కరించడానికి రాజకీయాలు, ఇతర అంశాలతో కథ చాలా నిస్సారంగా సాగుతుంది. సునీల్ తరహా రొటీన్ కామెడీ, పంచులతో వ్యవహారమంతా చాలా సాదాసీదా మారుతుంది. ఇక భార్యభర్తల మధ్య కలహాలు అనే చిన్న పాయింట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ కార్డు పడుతుంది. సెకండాఫ్‌లో ఆ తర్వాత కథ అమెరికాకు చేరుతుంది. అమెరికాలో వివాహ సంబంధాలు, యాంత్రిక జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇక రెండో భాగంలో 30 నిమిషాల అనంతరం అసలు కథ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి కథపై, సన్నివేశాలలో ఉండే భావోద్వేగాలు ప్రేక్షకుడిని ఆకట్టుకొంటాయి. ప్రీక్లైమాక్స్ ప్రేక్షకులను కొంత ఎమోషనల్ పాయింట్లను టచ్ చేస్తుంది. భార్యభర్తలు ఒక్కటయ్యే రొటీన్ క్లైమాక్స్‌తో ముగింపు కార్డు పడుతుంది. కథా విశ్లేషణ 2 కంట్రీస్ విషయానికి వస్తే ఫస్టాఫ్ మైనస్ అని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో అమెరికాలో తెరకెక్కించిన సన్నివేశాలు కథకు బలాన్ని ఇచ్చేలా ఉంటాయి. కథలో ఉండే భావోద్వేగాన్ని చక్కగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ప్రేక్షకుల సహనం, ఓపికకు పరీక్ష తారాస్థాయికి చేరుకోవడం వల్ల సినిమాపై పట్టు సడలినట్టు అనిపిస్తుంది. ఏది ఏమైనా కథలో ఉండే మంచి పాయింట్‌ను ఆసక్తికరంగా మలచకపోవడమనేది ఈ చిత్రానికి ప్రధానలోపం అనేది మెజారిటి ప్రేక్షకుల అభిప్రాయం. ఎన్ శంకర్ డైరెక్షన్ గురించి దర్శకుడు ఎన్ శంకర్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. జయం మనదేరా, శ్రీ రాములయ్య, ఎన్‌కౌంటర్, జై భోలో తెలంగాణ లాంటి సామాజిక చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆయనకు ఉంది. అయితే సంసారం, కలతలు, కన్నీళ్లు అనే కథను ఎన్ శంకర్ నుంచి ఊహించడం చాలా కష్టమైనదే. గత చరిత్ర అంతా పక్కన పెడితే తెలుగు నేటివిటికి, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథను, సన్నివేశాలను ఆసక్తిగా రాసుకోకపోవడం మొదటి భాగంలో కొన్ని లోపాలుగా కనిపిస్తాయి. ఓవరాల్‌గా ఎన్ శంకర్ స్థాయికి 2 కంట్రీస్ లేదని గట్టిగా చెప్పవచ్చు. సునీల్ గురించి ఉల్లాస్‌గా సునీల్ మళ్లీ ఓ రొటిన్ పాత్రలో కనిపించాడు. రెగ్యులర్ కామెడీతో సునీల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. సెకండాఫ్‌లో కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని పండించాడు. ఈ చిత్రం సునీల్‌కు నటుడిగా ఊరటనివ్వవచ్చేమో కానీ గొప్ప విజయాన్ని అందించడం కష్టమనే చెప్పవచ్చు. టాలెంటెడ్ అనే సునీల్‌కు పేరు ఉన్నప్పటికీ.. ఆ స్థాయిలో కథ పడటకపోవడమే ప్రధాన కారణమనిపిస్తుంది. పాటల్లో సునీల్ యదావిధిగా మెరుపులు మెరిపించాడు. హీరోయిన్‌గా మనీషా రాజ్ సునీల్ సరసన హీరోయిన్‌గా లయ పాత్రలో మనీషా రాజ్ కనిపించింది. తల్లితండ్రులు విడిపోవడం వల్ల పరిస్థితుల ప్రభావంతో మద్యానికి బానిసైన ఓ యువతి పాత్రలో మనీషా కనిపించింది. అమెరికాలో సంస్కృతి అలవాటు పడిన యువతిగా మెప్పించింది. తొలి చిత్రమైన ఫర్వాలేదనిపించే రీతిలో నటించింది. నటనపరంగా ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. మిగితా పాత్రల్లో ఇక సునీల్ తల్లిదండ్రులుగా చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, స్నేహితుడిగా శ్రీనివాసరెడ్డి నటించారు. అయితే ఈ చిత్రంలో వారి పాత్రలు గొప్పగా ప్రభావం చూపే పాత్రలు కావు. కానీ శ్రీనివాస్ రెడ్డి పాత్ర సినిమాను మలుపుతిప్పడానికి ఉపయోగపడింది. శ్రీనివాస్, సునీల్ కామెడి కెమిస్ట్రీ పెద్దగా ఆకట్టుకోనేలా లేకపోవడం మరో లోపంగా చెప్పవచ్చు. భారీ సంఖ్యలో నటీనటులు అమెరికా ఎపిసోడ్‌లో చాలా పాత్రలే కనిపించాయి. శివాజీ రాజా, సంజన, సిజ్జూ, సితార, నరేష్, ఝాన్సీ, కమెడియన్ పృథ్వీ లాంటి పెద్ద ఆర్టిస్టులే కనిపిస్తారు. కానీ కథను ప్రభావితం చేసే పాత్రలుగా లేకపోవడం కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. నరేష్ ఒక్కడికి ఫుల్ మార్కులు వేయవచ్చు. సాంకేతిక విభాగాల పనితీరు సాంకేతిక విభాగానికి వస్తే కెమెరామెన్ రామ్‌కుమార్ పనితీరు ఆకట్టుకునేలా ఉంది. గ్రామీణ అందాలనే కాకుండా అమెరికా బ్యూటీని తన కెమెరాలో అందంగా బంధించాడు. ఇక గోపి సుందర్ మ్యూజిక్, ఎడిటింగ్ ఇతర విభాగాలు ఓకే అనే విధంగా ఉంటాయి. శ్రీధర్ సీపాన సంభాషణలు, కామెడీ పెద్దగా పండించలేకపోయాయి. బలం, బలహీనతలు ప్లస్ పాయింట్స్ మూల కథ రాంప్రసాద్ కెమెరా మైనస్ పాయింట్స్ రొటీన్ స్టోరి స్క్రీన్ ప్లే కామెడీ తెర వెనుక, తెర ముందు నటీనటులు: సునీల్, మనీషా రాజ్, సంజన, రాజా రవీంద్ర, నరేష్, సితార, సిజ్జు, షియాజి షిండే, చంద్రమోహన్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు నిర్మాత, దర్శకత్వం: ఎన్ శంకర్ మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్ కెమెరా: రాం ప్రసాద్ రిలీజ్ డేట్: డిసెంబర్ 29, 2017