Director : Raj Satya
Producer : S. N. Reddy
Music Director : Sunil Kashyap
Cinematographer : B. V. Amaranath Reddy
Editor : M. R. Varma
Continuing the trend of low budget films, yet another film which has hit the screens today is Hyderabad Love Story. Let’s see how the film turns out to be.
Story:
Bhagya Lakshmi(Reshmi Menon) falls head over heels for Karthick(Rahul Ravindran). She tries hard and somehow wins over Karthick. When everything seems to be going fine between the couple, Karthick’s ex-lover, Vaishnavi(Jia) come into the scene and disrupts the love story. Why did Vaishnavi come back into Karthick’s life? What problems did she create for Karthick? and how does he come out of this mess? That forms the rest of the story.
Plus Points :
Yet again, Rahul Ravindran shines in his role of a class lover boy. The talented actor once again carries the film on his shoulders with his settled performance. Rahul’s performance is very good during all the emotional scenes in the second half. He is one actor who is yet to get his due in Tollywood as he gives his best in every film of his.
Reshmi Menon also does a decent job in her role. The second half is where the actual story begins. Rahul’s backstory, his family values and the way all this is showcased in a decent manner. The friendship angle showcased and the emotion derived from it looks good.
Minus Points :
As the story unfolds only in the second half, the first half is quite simple with nothing much going its way. The story of the film is quite weak and routine. As the film unwinds itself, the proceedings get bogged down with slow narration.
Even though Rahul tries hard to salvage things with his performance, the weak scenes and lack of depth in the screenplay side track the film. The director fails to generate basic emotions between the pair as there is not much chemistry between them. There is no proper justification for the film’s title.
Technical Aspects:-
Music by Sunil Kashyap is just about okay. Editing my M R Varma is average and so was the camera work. Production values from S N Reddy were pretty good. Coming to the director Raj, he has done a half-hearted job with the film. Even after having a seasoned performer like Rahul Ravindran, he narrated the film on a pale note and did not manage to hold the audience attention with his disappointing narration.
Verdict:
On the whole, Hyderabad Love Story is the same old story which you have seen many a time. The only respite is hero Rahul’s sincere performance and his flashback which has some decent moments. Apart from this, the film has nothing romantic to offer and ends up as just another routine love story this weekend.
యువతరం నటుల్లో టాలెంట్ హీరోగా రాహుల్ రవీంద్రన్ పేరు తెచ్చుకొన్నాడు. తన తొలిచిత్రం అందాల రాక్షసితోనే ఆకట్టుకొన్నాడు. సాఫ్ట్ క్యారెక్టర్లు, లవర్ బాయ్ పాత్రలతో రాహుల్ తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. హీరోయిన్లు రేష్మీ మీనన్, జియాతో కలిసి రాహుల్ రవీందన్ నటించిన తాజా చిత్రం హైదరాబాద్ లవ్‌స్టోరీ. కొత్త దర్శకుడు రాజ్ సత్య డైరెక్షన్‌లో ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ రూపొందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రాయాంగిల్ లవ్‌స్టోరిగా ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. Popular Videos 00:44 బిజీ బిజీ గా ఉన్న తాప్సీ 01:31 బెండకాయక్కా అనేవారు నన్ను.. శ్రుతీహాసన్. 01:11 అందలం ఎక్కేస్తున్న రాజ్ తరుణ్... హైదరాబాద్ లవ్‌స్టోరీ కథ భాగీ అలియాస్ భాగ్యలక్ష్మి (రేష్మీ మీనన్) చలాకైన యువతి. మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో కార్తీక్ (రాహుల్ రవీంద్రన్) ఇంజినీర్‌గా పని చేస్తుంటాడు. తొలిచూపులోనే కార్తీక్, భాగీ ప్రేమలో పడుతారు. భాగీతో ప్రేమలో పడటానికి ముందే కార్తీక్‌కు వైష్ణవి (జియా) అనే యువతితో బ్రేకప్ అవుతుంది. కార్తీక్‌తో పీకల్లోతూ ప్రేమలో మునిగిన భాగీకి వైష్ణవి ఓ భయంకరమైన విషయాన్ని చెబుతుంది. దాంతో కార్తీక్, భాగీకి మధ్య మనస్పర్ధలు వస్తాయి. ముగింపు ఇలా.. కార్తీక్ గురించి భాగీకి వైష్ణవి చెప్పిన భయంకరమైన విషయం ఏమిటి? కార్తీక్, వైష్ణవి మధ్య అఫైర్ ఎందుకు బ్రేకప్ అయింది? కార్తీక్, వైష్ణవి మళ్లీ కలుసుకొన్నారా? కార్తీక్, భాగీ ప్రేమకు ముగింపు ఏమిటీ? కార్తీక్ జీవితంలో అలీ అనే యువకుడి పాత్ర ఏమిటీ? కథలో రావు రమేష్ ఏ విధంగా కీలకంగా మారాడు అనే ప్రశ్నలకు తెరమీద సమాధానమే హైదరాబాద్ లవ్ స్టోరీ. కథ, స్రిప్టు విశ్లేషణ-1 రాహుల్ రవీంద్రన్, రేష్మీ తొలిసారి కలుసుకోవడం, ఆ తర్వాత ప్రేమలో పడటం అనే అంశంతో కథ ప్రారంభమవుతుంది. రాహుల్, రేష్మీ మధ్య ప్రేమ, ఆకర్షణ అంశాలతో లవ్ ట్రాక్‌ను దర్శకుడు రాజ్ సత్య ఆహ్లాదంగా కొనసాగిస్తూనే, దానికి కామెడీ ట్రాక్‌ను మిక్స్ చేశాడు. అయితే కామెడీ ట్రాక్ నాసిరకంగా ఉండటం కారణంగా కథావేగం, స్టోరిలోని ఇంటెన్సిటీని పక్కదారి పట్టించేలా చేసింది. ఓ ఆసక్తికరమైన పాయింట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. కథ, స్రిప్టు విశ్లేషణ-2 సెకండాఫ్‌లో జియాతో కార్తీక్ లవ్ ట్రాక్, కార్తీక్, రేష్మీల ప్రేమ వ్యవహారం ఎపిసోడ్స్ ఫీల్‌గుడ్‌గా అనిపిస్తాయి. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ పర్సనల్ లైఫ్ బ్యాక్ డ్రాప్ కీలకమైన అంశంగా మారుతుంది. కథ మొత్తం రాహుల్ వ్యక్తిగత జీవితం చూట్టే తిరగడంతో కథ మరొ మెట్టు ఎక్కినట్టు కనిపిస్తుంది. క్లైమాక్స్‌లో భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. ఫీల్‌గుడ్ నోట్‌తో హైదరాబాద్ లవ్‌స్టోరీ ముగుస్తుంది. దర్శకుడు రాజ్ సత్య తడబాటు దర్శకుడు రాజ్ సత్య ఎంచుకొన్న ప్రధానమైన పాయింట్ బాగుంది. కాకపోతే ఆ మెయిన్ పాయింట్ చుట్టు అల్లుకొన్న కామెడీ ట్రాక్ విషయంలోనే తడబాటుకు గురయ్యాడు. నాసిరకమైన కామెడీతో వెగటు పుట్టించాడు. సినిమా తొలిభాగంపై దర్శకుడు పట్టుకోల్పోయినాడనే భావన కలుగుతుంది. కాకపోతే సెకండాఫ్‌లో తనదైన టేకింగ్‌తో కొత్త దర్శకుడు అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. కీలక సన్నివేశాల్లో తనదైన ప్రతిభను చాటుకొన్నాడు. కథపై, కామెడీ ట్రాక్‌పై మరింత కసరత్తు చేసి ఉంటే ఫీల్‌గుడ్ సినిమా తన కెరీర్‌లో పడి ఉండేది. ఆకట్టుకొన్న రాహుల్ రవీంద్రన్ లవర్ బాయ్ క్యారెక్టర్లలో రాహుల్ రవీంద్రన్ నటన ప్రత్యేకంగా కనిపిస్తుంది. అతడి హావభావాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ సినిమాలో తండ్రి చనిపోయిన సన్నివేశంలోనూ, తన మిత్రుడు కోమాలోకి వెళ్లిపోయే సీన్‌లో భావోద్వేగమైన నటనను ప్రదర్శించాడు. తన పాత్ర పరిధి మేరకు రాహుల్ మంచి నటనతో ఆకట్టుకొన్నాడు. రేష్మీ మీనన్ గ్లామర్ హైదరాబాద్ లవ్‌స్టోరి సినిమాకు రేష్మీ మీనన్ గ్లామర్ అదనపు ఆకర్షణ. చక్కటి నవ్వుతో, మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో అద్భుతంగా కనిపించింది. కీలక సన్నివేశాల్లోనూ మెప్పించింది. నటనపరంగా మరింత శ్రద్ధ తీసుకొంటే గ్లామర్‌తోపాటు ప్రతిభవంతురాలైన నటిగా పేరుతెచ్చుకొనే అవకాశం ఉంది. జియా అందాల ఆరబోత కార్తీక్‌కు మరో లవర్‌గా జియా కనిపించింది. గ్లామర్‌తోనే కాకుండా అందాల ఆరబోతలో కూడా జియా ముందున్నట్టు కనిపించింది. జియా నటనకు కూడా మంచి స్పందనే కనిపించింది. కీలక సన్నివేశాల్లో కొంత తడబాటు కనిపించింది. మరోసారి రావు రమేష్ ఇతర పాత్రల్లో గుర్తుండిపోయే రోల్ రావు రమేష్‌ది. డాక్టర్ పాత్రలో తన మార్కును వదలిపెట్టలేదు. కథకు ఆయువుపట్టుగా మారిన సీన్లకు రావు రమేష్ జీవంపోశాడు. సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. సూర్య, సనలు ఆకట్టుకొన్నారు. హాస్య నటులు మాత్రం విసుగు పుట్టించారు. సినిమాకు ప్రతిబంధకంగా మారారు. ఆహ్లాదంగా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు బీవీ అమర్నాథ్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ ప్లస్ అయింది. చాలా రిచ్‌గా సీన్లను తెరకెక్కించడంలో అమర్నాథ్‌రెడ్డి సఫలమ్యాయాడు. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ పనితీరు బాగున్నది. తన కత్తెరకు వర్మ ఇంకా పదునుపెట్టి ఉంటే సినిమా చాలా క్రిస్ప్‌గా ఉండేది. సునీల్ కాశ్యప్ రీరికార్డింగ్ బాగుంది. పాటలు బాగున్నప్పటికీ మాస్ ప్రేక్షకులకు, యూత్‌కు చేరేలా లేవనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఆసక్తికరమైన పాయింట్‌తోపాటు మత సామరస్యం లాంటి అంశాలను టచ్ చేస్తూ నిర్మాతలు ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొదుమగుళ్ళ చేసిన ప్రయత్నం అభినందనీయం. కాకపోతే కథనం విషయంలో కొంత జాగ్రత్తపడి ఉండే మంచి సినిమాను అందించిన పేరు వచ్చేంది. అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపించింది. సినిమాపై నిర్మాతలకు ఉన్న అభిరుచి ప్రశంసనీయం అని చెప్పవచ్చు. ఫైనల్‌గా రొటీన్ ప్రేమ కథ కాకుండా ఓ డిఫరెంట్ పాయింట్‌తో హైదరాబాద్ లవ్‌స్టోరి రూపొందింది. నటీనటులు పెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల ప్రతిభ ఈ సినిమాకు బలం అని చెప్పవచ్చు. కాకపోతే కామెడీ సన్నివేశాలు చికాకు పుట్టిస్తాయి. ఎలాంటి అంచనాలు లేకుండా కాలక్షేపానికి వెళితే సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. బలం, బలహీనతలు ప్లస్ పాయింట్స్ రాహుల్ రవీంద్రన్, రేష్మీ నటన కథ సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ మైనస్ పాయింట్ కామెడీ కథనం డైలాగ్స్ తెర ముందు, తెర వెనుక నటీనటులు: రాహుల్ రవీంద్రన్, రేష్మీ మీనన్, జియా, రావు రమేష్, అంబటి, రమాప్రభ, షఫీ, సన, సూర్య, రచ్చ రవి తదితరులు కథ, డైలాగ్స్ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం: రాజ్ సత్య నిర్మాతలు: ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొదుమగుళ్ళ సినిమాటోగ్రఫీ: బీవీ అమర్నాథ్‌రెడ్డి ఎడిటర్ : ఎం ఆర్ వర్మ మ్యూజిక్ : సునీల్ కశ్యప్ సమర్పణ: మాస్టర్ ప్రణవ్ తేజ్ బ్యానర్ : సినిమా పీపుల్ రిలీజ్ డేట్: ఫిబ్రవరి 23, 2018
Comments
Post a Comment