Sai Dharam Tej is going through a tough time in his career and badly needs a hit under his belt. He has pinned a lot of hopes on his new film Intteligent which has hit the screens today. Let’s see whether this film gives Tej his much-needed hit.
Story:
Dharam Tej(Tej) is a software engineer who is very loyal to his company and its MD(Nasser). As time passes by, a criminal gang lands in Hyderabad and tries to overtake the company. In this process, Nasser gets killed and to make things better, Dharma Bhai enters the scene. Who is this Dharma Bhai? What does he have to do with Nasser and his company? and how does he solve all the problems? That forms the rest of the story.
Plus Points :
Sai Dharam does well in his role as a software engineer. The way he transforms himself in the second half and carries the film on his shoulders looks okay. He has danced well and acting wise, Tej is pretty sincere in whatever he does. Lavanya Tripathi is just about okay in her role and does not have much to do with the film.
Some comedy generated through Posani and Jayaprakash Reddy during the initial stages of the film evokes some laughs. The interval bang where Dharma Bhai is revealed looks good. The slight comedy about Dharma Bhai featuring Brahmanandam is decent to an extent.
Minus Points:
One of the biggest drawbacks is that the film lacks a basic story line. Mafia overtaking a software company looks quite odd and does not generate any novelty. The film is filled with over the top elements completely which have no sync at all.
Characters keep coming in frequently and deviate your attention. Vinayak is stuck in the good old days and narrates things on a predictable and silly note. There are scenes where thousands of crores from the villain gang are transferred to poor people just like that. The film is filled with such silly scenes which are meaningless.
The second half takes a severe beating as thing happen so conveniently for the hero. Yet another drawback is that there are no major twists in the film as the proceedings are unleashed on a dull note.
Technical Aspects:
Production values of the film are mediocre as the visuals look quite outdated in many areas. Music score by Thaman is a huge disappointment as none of the songs impresses. Choreography for the Chammaku Chammku looks odd as Lavanya struggles hard to match steps with Tej. Camera work is okay and presents the film on a decent note. Story and dialogues by Akula Shiva are silly and stuck in the 90’s era.
Coming to the director Vinayak, he has done a very disappointing job with the film. Intteligent is his weakest film in his career as it looks quite outdated right from the scene one. There is no basic emotion in the film and the screenplay by Vinayak does not help matters much. The star director has failed to connect the audience in not even a single aspect making things difficult for them.
Verdict:-
On the whole, Intteligent is V V Vinayak’s weakest film to date. The routine story, predictable narration and lack of basic twists and entertainment go against the film completely. It is sad to see Sai Dharam Tej’s sincere efforts and performance go waste in the film. Even a star hero cannot help matters when films like these are narrated in such a haphazard manner. Apart from Tej’s role and screen presence, this film does not generate any interest and ends up as a disappointing watch this weekend.
మెగా డైరెక్టర్ వివి వినాయక్, మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్.... ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన 'ఇంటిలిజెంట్' సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ముందు నుండి మంచి అంచనాలు ఉన్నాయి. వరుస ప్లాపులతో ఉన్న సాయి ధరమ్ తేజ్‌ను వినాయక్ తన కమర్షియల్ ఫార్ములాతో హిట్ బాట పట్టిస్తాడని అంతా నమ్మకంగా ఎదురు చూశారు. గతంలో నాయక్, తులసి, లక్ష్మి లాంటి హిట్ చిత్రాలకు కథ అందించిన ఆకుల శివ ఈ చిత్రానికి కథ సమకూర్చడంతో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి కారణమైంది. మరి ఈ సనిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించింది అనేది సమీక్షలో చూద్దాం..... Popular Videos 01:58 కోటి రూపాయలు ఇచ్చినా ఆ పాత్ర చేయను.. 01:09 వామ్మో ఆయన క్రేజ్ ఏంటండీ..? పవన్ గురించి సాయి పల్లవి... 01:32 రాంచరణ్ రావాల్సిందే.. వేసవిలో పేలే తొలి బాంబు కథ నంద కిషోర్ (నాజర్) ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ రన్ చేస్తూ టెక్నాలజీ ఉపయోగించి పేద ప్రజలకు సహాయం అందేలా చేయడంతో పాటు, తనూ నలుగురికి సహాయం చేస్తుంటాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాయి ధరమ్ తేజ్ టాలెంట్ గ్రహించిన నందకిషోర్ తన ఖర్చుతో మన హీరోను చదవిస్తాడు. పెరిగి పెద్దయి సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన హీరో బయటి కంపెనీల్లో పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నా లెక్కచేయకుండా నందకిషోర్‌కు చేదోడువాదోడుగా ఉంటూ నలుగురికీ సహాయం చేయడంలోనే ఆనందం వెతుక్కుంటూ ఉంటాడు. అంతా సవ్యంగా జరిగితే సినిమా ఎలా అవుతుంది?... సీన్లోకి విలన్ విక్కీ భాయ్(రాహుల్ దేవ్) ఎంటరవుతాడు. కంపెనీ తన పేరున రాయాలని బెదిరిస్తాడు. వినక పోవడంతో నందకిషోన్‌ను చంపేసి కంపెనీ తన పేరున రాయించుకుంటాడు. తాను ఇంతటివాడిని కావడానికి కారణమైన బాస్‌ను చంపిన వారిపై హీరో ఎలా రివేంజ్ తీసుకున్నాడు? అనేది మిగతా కథ. సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ వంకపెట్టే విధంగా ఏమీలేదు... అదే సమయంలో గొప్పగా చెప్పుకోవడానికి కూడా లేదు. ఎప్పటిలాగే రోటీన్ గా కనిపించాడు. ధర్మాభాయ్ పాత్రలో ప్రత్యేక శైలి చూపించలేకపోయాడు. ఫైట్స్ ఇరగదీశాడు... చమక్ చమక్ ఛాం పాటలో చిరంజీవిని గుర్తు చేశాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ లావణ్య త్రిపాఠి పరిమితమైన పాత్రలో కనిపించింది. నటించడానికి అవకాశం కూడా లేదు. కేవలం పాటల్లో నటించడానికే అన్నట్లు ఆమె పాత్ర ఉంది. అది కూడా సరిగా చేయలేక పోయింది. సాయి ధరమ్ తేజ్ సరసన డాన్స్ స్టెప్పులు వేయడంలో తేలిపోయింది. కాళ్లు, చేతులు, నడుము ఆడించడం తప్ప రిథమ్ కనపించలేదు. డ్యూయెట్ సాంగులపై ఈ ఎఫెక్టు బాగా కనిపించింది. ఇతర పాత్రలు సినిమాలో ఇతర పాత్రల గురించి మాట్లాడుకుంటే.... నంద కిషోర్ పాత్రకు నాజర్ పూర్తి న్యాయం చేశారు. విలన్ పాత్రల్లో కనిపించి రాహుల్ దేవ్, దేవ్ గిల్... పవర్‌ఫుల్ గా కనిపించలేదు. హోం మినిస్టర్ పాత్రలో వినీత్ కుమార్, పోలీస్ ఆఫీసర్ల పాత్రల్లో ఆశీష్ విద్యార్థి, షాయాజీ షిండే ఫర్వాలేదు. కమెడియన్లు సినిమాలో బ్రహ్మానందం, బద్రం, పృథ్వి, రాహుల్ రామకృష్ణ, నల్లవేణు, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, ఫిష్ వెంకట్ తదితర కమెడియన్లు ఉన్నా సినిమాలో పెద్దగా కామెడీ పండలేదు. సినిమా మొత్తం మీద ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటీ కనిపించలేదు. టెక్నికల్ అంశాలు టెక్నికల్ అంశాల పరంగా చూస్తే ఎస్వీ విశ్వేశ్వర్ అందించిన సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. తమన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అంత గొప్పగా లేకున్నా ఓకే అనొచ్చు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బావుండేది. సికె ఎంటర్టెన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు బావున్నాయి. ఆకుల శివ కథ ఆకుల శివ అందించిన స్టోరీ పరమ రోటీన్‌గా ఉంది. సాదా సీదా రివేంజ్ డ్రామా చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. వెతుకుదామన్నా సినిమాలో ఒక్క ట్విస్ట్ కూడా కనిపించదు. దీనితోడు లాజీక్ లేని సీన్లు కూడా ప్రేక్షకులకు బోర్ తెప్పిస్తాయి. వివి వినాయక్ సినిమా హ్యాండిల్ చేసిన తీరు వివి వినాయక్ సినిమా అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఉంది. మాస్ మసాలా, కమర్షియల్ ఎలిమెంట్స్ కావాల్సినన్ని ఉంటాయని ప్రేక్షకులు థియేటర్లకువస్తారు. అయితే వినాయక్ తన స్థాయికి తగిన విధంగా సినిమాను హ్యాండిల్ చేయలేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ ఎపిసోడ్లు, కామెడీ సీక్వెన్స్ ఇలా ఏ విషయంలోనూ వినాయక్ ముద్ర కనిపించలేదు. స్క్రీన్ ప్లే చాలా బోరింగ్‌గా ఉంది. ప్లస్, మైనస్ పాయింట్స్ సాయి ధరమ్ తేజ్, సినిమాటోగ్రఫీ, చమక్ చమక్ ఛాం రిమిక్స్...ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. కథ, కథనం, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. స్నేక్ గ్యాంగ్‌కు, సినిమాకు లింకు ఉందా? ఇటీవల ఇంటర్వ్యూలో దర్శకుడు వివి వినాయక్ స్నేక్ గ్యాంగ్ గురించి తమ సినిమాలో కొన్ని సీన్లు చూపించామని చెప్పారు. కానీ సినిమాలో కేవలం పాములతో చంపే ఓ సీన్ తప్ప... ఆ గ్యాంగ్ గురించి ఏమీ లేదు. అది జస్ట్ పబ్లిసిటీ స్టంటే అని మనం అర్థం చేసుకోవాలి. చివరిగా కేవలం వివి వినాయక్ బ్రాండ్ నేమ్ ప్రేక్షకుడిని థియేటర్ వరకు నడిపించింది. కానీ ప్రేక్షకుడికి అక్కడ వినాయక్ నుండి ఆశించిన ఎంటర్టెన్మెంట్ దక్కలేదు. సాయి ధరమ్ తేజ్‌లో టాలెంట్ ఉన్నా హిట్ కథలు ఎంపిక చేసుకోవడంతో మరోసారి తడబడ్డాడు. ఇంటిలిజెంట్ తారాగణం: సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, నాజర్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్, దేవ్‌గిల్, వినీత్‌కుమార్, జె.పి. ప థ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్, విద్యుల్లేఖా రామన్, సప్తగిరి, తాగుబోతు రమేష్, భద్రం, నల్ల వేణు, రాహుల్ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్, సంధ్యా జనక్, ఫిష్ వెంకట్, శ్రీహర్ష, శివమ్ మల్హోత్రా, రవిరామ్ తేజ, తేజారెడ్డి కథ, మాటలు: శివ ఆకుల సినిమాటోగ్రఫీ: ఎస్.వి. విశ్వేశ్వర్ సంగీతం: థమన్ ఎడిటింగ్: గౌతంరాజు ఆర్ట్: బ్రహ్మ కడలి ఫైట్స్: వెంకట్ డాన్స్: శేఖర్, జాని సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా నిర్మాత: సి.కళ్యాణ్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్ తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Comments
Post a Comment