Krishna(Nikhil) is a happy go lucky engineering student who spends a mischevious life along with his group of friends. He falls in love with his senior Meera(Simran) and when everything seems to be going fine, a tragic incident changes Krishna’s life upside down. Rest of the story is as to how Krishna manages to solve all his problems and comes out as a successful student and sincere human being.
Plus Points :
Kiraak Party is Nikhil’s one-man show. It is Nikhil’s emotional performance which clicks for the film. Nikhil is shown in two different shades and the young hero impresses in both his avatars. The way he transforms from a simple guy to a strong student leader is quite good. Nikhil is very good especially in the last fifteen minutes of the film where he showcases diverse emotions.
The first half of the film has some decent college fun with good songs keeping things light even though there is not much story. The last 20 minutes of the film is quite emotional and ends things quite nicely.
Heroine Simran does a decent job in her role. The college set up, the student’s rivalry and the regular fun which every college has is showcased in a decent manner.
Minus Points:
One of the biggest drawbacks of the film is that there is no strong storyline. The conflict point that is showcased does not elevate the proceedings much. Hero suffers a huge setback because of the heroine and this changes his life. There should have been some strong scenes between the lead pair to showcase the above-said pain that the hero suffers in the latter half.
The first half an hour in the second half is quite bland and does not have any interesting episodes. The second heroine Samyuka Hegde looks weak and a better heroine should have made things quite better for the audience.
The bonding between the friends should have been showcased in an even stronger manner. Comedy quotient which is a must for college flicks is slightly missing in this film.
Technical Aspects:
Production values by AK Entertainments are quite good as the college backdrop has been showcased richly. The camerawork is also pretty good as the youthful visuals are quite pleasing to the eye. Dialogues are decent and so was the music. The background score was also decent but the editing should have been a tad better as the film is quite lengthy in its runtime.
Coming to the director Sharan Kopishetty, he has done a decent job with the film. Though he does not create any rib-tickling comedy or great romance between the lead pair, he presents the film on a decent and passable note. Even though he fails to establish things in the first half, he makes it up during the last half an hour as scenes featuring hero’s realization end the film on a good note.
Verdict:
On the whole, Kirrak Party is a youthful college drama which has some good moments in the second half. Nikhil leads from the front with his brilliant performance and saves the film completely. This film is clearly aimed at the youth and they should connect to all the various happenings in the college life which are shown well. If you ignore the below par story and lack of rib-tickling comedy, this film ends up as a decent watch this weekend. Just keep your expectations in check.
హ్యాపీడేస్ చిత్రంతో కెరీర్ ఆరంభించిన నిఖిల్ సిద్ధార్థ్ టాలీవుడ్‌లో సక్సెస్‌లతో దూసుకెళ్తున్నారు. స్వామి రారా సినిమాతో ప్రారంభమైన విజయాల వేట కేశవ వరకు సాగింది. తాజాగా కన్నడంలో విజయవంతమైన కిరిక్ పార్టీ సినిమా రీమేక్‌గా మలిచి కిరాక్ పార్టీగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోయిన్లుగా సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా నటించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా, దర్శకుడు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందించారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రం మార్చి 16న రిలీజ్ అయింది. నిర్మాత అనిల్ సుంకర నిర్మాణ సారథ్యంలో పక్కా కాలేజీ, యూత్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం గురించి తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. రాత్రికి ఫ్రీనా అని అడిగాడు, బాడీ గురించి వర్ణిస్తా.. పవన్ కోసం ఆరు పేజీల ప్రేమ లేఖ, మాధవీలత సంచలనం! హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇక మీ అరచేతిలో, ఫ్యాన్స్‌కి బోలెడు లాభాలు కూడా! పద్మవిభూషణ్ అందుకున్న ఇళయరాజా Featured Posts Popular Videos 01:02 "ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం" విడుదల వాయిదా!! 01:37 ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని 01:38 రాజమౌళి దిమ్మతిరిగే ప్లానింగ్.. బాహుబలి తరహాలో మల్టీస్టారర్..! కిరాక్ పార్టీ కథ కృష్ణ (నిఖిల్ సిద్ధార్థ) ఇంజినీరింగ్ స్టూడెంట్. ఐదుగురు ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ కాలేజీలో హంగామా చేస్తుంటాడు. అలాంటి కృష్ణ తన సీనియర్ మీరాతో ప్రేమలో పడుతాడు. కానీ ఓ కారణంగా మీరా అతడికి దూరమవుతుంది. దాంతో సరదాలకు దూరమైన కృష్ణ వైరాగ్యానికి లోనవుతాడు. ఆ తర్వాత కాలేజీలో జూనియర్ సత్య (సంయుక్త హెగ్డే) కృష్ణను చూసి ప్రేమలో పడుతుంది. కృష్ణ జీవితంలోకి సత్య ప్రవేశించిన తర్వాత ఏమి జరిగిందనేది కిరాక్ పార్టీ సినిమా కథ. కృష్ణ జీవితంలోకి తాను అమితంగా ప్రేమించిన మీరాకు కృష్ణ ఎందుకు దూరమయ్యాడు? ఏ పరిస్థితుల్లో మీరాను కోల్పోయాడు? సరదాగా ఉంటే కృష్ణ ఒక్కసారిగా వైరాగ్యానికి లోనవ్వడానికి కారణం? కృష్ణ జీవితంలోకి సత్య ప్రవేశించిన తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు తెరపైన సమాధానం కోసం కిరాక్ పార్టీ చూడాల్సిందే.. ఫస్టాప్‌లో కథ, కథనాలు కిరాక్ పార్టీ తొలిభాగంలో కాలేజీ వాతావరణం, సీనియర్లు, జూనియర్లకు మధ్య ర్యాగింగ్, గొడవలు, కొట్లాటలతో సాగిపోతుంది. ఆ తర్వాత మీరాకు కృష్ణ దగ్గరవ్వడంతో కథ రొమాంటిక్‌గా మారుతుంది. కృష్ణ జీవితం సాఫీగా సాగుతుందనుకొంటున్న సమయంలో ఒక్క కుదుపు కుదిపేస్తుంది. ఎవరూ ఊహించిన ఓ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. రెండోభాగంలో కథ, కథనాలు ఇంటర్వెల్ తర్వాత కాలేజీలో కృష్ణ గంభీరమైన వ్యక్తిగా కనిపిస్తాడు. సరదాలకు దూరమై కాలేజీ గ్యాంగ్ వార్ మధ్య కాలం వెల్లదీయడం లాంటి జరుగుతుంటాయి. ఈ మధ్యలో సత్య అతడి జీవితంలోకి ప్రవేశించడంతో మళ్లీ కథనం కొంత పుంజుకొన్నట్టు కనిపిస్తుంది. మీరా దూరమైన కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లిన కృష్ణ వాస్తవ జీవితంలోకి రావడంతో కథకు ముగింపు పడుతుంది. దర్శకుడి ప్రతిభ కన్నడ కిరిక్ పార్టీని పోల్చితే శరణ్ కొప్పిశెట్టి తెలుగులో కిరాక్ పార్టీని పూర్తిస్థాయి కాలేజీ, యూత్ చిత్రంగా రూపొందించే ప్రక్రియలో తడబాటుకు గురయ్యాడని చెప్పవచ్చు. కాలేజీలో సన్నివేశాల చిత్రీకరణలో, కృష్ణ, మీరా లవ్ ఎపిసోడ్‌లో ఎలాంటి కొత్తదనం కనిపించదు. ఆసక్తికరంగా సన్నివేశాలను రూపొందించడంలో విఫలమైనట్టు కొట్టొచ్చి కనబడుతాయి. కథ, కథనాలు, సన్నివేశాల రూపకల్పనలో రొటీన్ వ్యవహారమే ప్రేక్షకుడికి ఎదురవుతుంది. ఓవరాల్‌గా హ్యాపీడేస్, ప్రేమమ్ లాంటి సినిమాలకు మించి ఆశించిన ప్రేక్షకులకు కొంత నిరాశనే కలిగించాడని చెప్పవచ్చు. నిఖిల్ ఫెర్ఫార్మెన్స్ హీరో నిఖిల్ పాత్ర విషయానికి వస్తే పలు రకాల షేడ్స్ కనిపిస్తాయి. యూత్ అల్లరి చిల్లరిగాగా మెప్పించాడు. సెకండాఫ్‌లో సీనియర్ స్టూడెంట్‌గా అమ్మాయిలను ఏడిపిస్తే తాట తీసే లీడర్‌గా ఆకట్టుకొన్నాడు. కథ, కథనాల్లో దమ్ము లేకపోవడం వల్ల నిఖిల్ తన పాత్రను మించి ప్రతిభను బయటపెట్టలేకపోయాడనిపిస్తుంది. సిమ్రాన్ యాక్టింగ్ మీరాగా సిమ్రాన్ పరీంజా కనిపించింది. సిమ్రాన్‌ది సాదాసీదా అమ్మాయి పాత్ర. ప్రేక్షకుడి సానుభూతిని పొందే అవకాశం ఉన్నప్పటికీ.. ఆమె పాత్ర పెద్దగా ఎలివేట్ కాలేకపోయింది. తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించింది. సంయుక్త హెగ్డే నటన ఇక సత్యగా కనిపించిన సంయుక్త హెగ్డేది అందరినీ ఆటపట్టించే తుంటరి అమ్మాయి పాత్ర. సత్య పాత్ర ఎంట్రీ తర్వాత కథలో కొంత ఆహ్లాదకరంగా మారుతుంది. రొటిన్‌గా సాగిపోతున్న పాత్రలో ఓ మెరుపుగా కనిపిస్తుంది. కాకపోతే ఆ మెరుపు ఎక్కువ కాలం కనిపించకపోవడం సంయుక్త మ్యాజిక్ వర్కవుట్ కాలేదు. మిగితా పాత్రల్లో కాలేజ్ గ్యాంగ్‌లో నిఖిల్ ఫ్రెండ్స్‌గా వివా రాఘవ్, బ్రహ్మాజీ తదితరులు నటించారు. అయితే కాలేజ్ గ్యాంగ్‌లోని పాత్రధారుల ఫెర్ఫార్మెన్స్ చాలా పేలవంగా అనిపిస్తుంది. ప్రేక్షకులతో ఏ ఒక్కరు కనెక్ట్ కావడానికి అవకాశమే లేకపోయింది. బ్రహ్మాజీ ఒకట్రెండు సీన్లలో ఒకే అనిపించారు. రఘు కారుమంచి పాత్రకు స్కోప్ లేకపోయింది. మిగితా పాత్రలన్నీ నామమాత్రంగానే మిగిలిపోయాయి. ఫీల్‌గుడ్ మ్యూజిక్ కిరాక్ పార్టీ సినిమాకు ప్రధానమైన బలం పాటలు, రీరికార్డింగ్. అంజనీష్ లోకనాత్ అందించిన మ్యూజిక్ ఒక్కటే సినిమాలో ఫీల్‌గుడ్‌గా అనిపిస్తుంది. గురువారం పాట, ఇతర పాటలు తెరమీద ఆకట్టుకొన్నాయి. సెకండాఫ్‌లో రీరికార్డింగ్ చక్కగా ఉంటుంది. ఇతర సాంకేతిక విభాగాలు అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎంఆర్ వర్మకు ఎడిటర్‌గా చాలా పని మిగిలిపోయిందనే భావన కలుగుతుంది. వర్మ కత్తెరకు ఇంకా పనిపెట్టాల్సి ఉంటుందేమో. సినిమా నిడివి ప్రేక్షకుల సహనానికి పరీక్షే అనిచెప్పవచ్చు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఏకే ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత అనిల్ సుంకర నిర్మాణ సారథ్యం సగటు సినిమా ప్రేక్షకుడి అభిరుచికి తగినట్టుగా ఉంది. సినిమాను చాలా రిచ్‌గా కనిపించడానికి ఎక్కడా రాజీ పడలేదనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ కథ, కథనాలపై మరికొంత జాగ్రత్త పడాల్సిందోమోననే భావన మాత్రం కలగడం సహజం. ఫైనల్‌గా కాలేజీలో లవ్ బ్యాక్ డ్రాప్ సినిమాలంటే ప్రేమదేశం, చెలి, హ్యాపీడేస్, ప్రేమమ్ లాంటి సినిమాలు కళ్ల ముందు కదలాడుతాయి. ఆ చిత్రాలు రొమాంటిక్ సినిమాలకు ఓ ప్రామాణికంగా నిలిచాయి. అలాంటి చిత్రాలతో కనిపించిన ఫీలింగ్స్, ఎమోషన్స్ కిరాక్ పార్టీలో కాస్త తక్కువే అనిచెప్పవచ్చు. టపాటపా పేలే డైలాగ్స్, హృదయానికి టచ్ చేసే సీన్లు తక్కువగా కనిపిస్తాయి. ప్రజెంట్ యూత్ ట్రెండ్ తగ్గట్టుగా కిరాక్ పార్టీని మలిచారు. యూత్ ఆడియెన్స్‌ను మెప్పిస్తే కిరాక్ పార్టికి ఎదురే ఉండకపోవచ్చు. బలం, బలహీనతలు ప్లస్ పాయింట్స్ నిఖిల్ యాక్టింగ్ రీరికార్డింగ్, పాటలు సంయుక్త హెగ్డే సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ సినిమా నిడివి స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఎడిటింగ్ తెరముందు, తెర వెనుక నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ, సిమ్రాన్ పరీంజా, సంయుక్త హెగ్డే, బ్రహ్మాజీ, రఘు కారుమంచి తదితరులు దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి నిర్మాత: అనిల్ సుంకర డైలాగ్స్: చందు మొండేటి స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ కథ: రిశబ్ శెట్టి మ్యూజిక్: అంజనీష్ లోక్‌నాథ్ ఎడిటర్: ఎంఆర్ వర్మ బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్: మార్చి 16, 2018
Comments
Post a Comment