కథ ఏంటంటే..
చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన తేజ్.. పెద్దమ్మ, పెదనాన్న, బాబాయిల దగ్గర పెరుగుతుంటాడు. ఈ క్రమంలో ఓ మహిళను దుండుగుల బారి నుంచి కాపాడే ప్రయత్నంలో హత్య చేసి ఏడేళ్ల శిక్ష అనుభవిస్తాడు. తన భర్త(అనిష్ కురువిల్ల)కు జరిగింది చెప్పి తన ప్రాణాలను కాపాడిన పిల్లాడి కోసం భారీ మొత్తంలో చెక్కు రాసిచ్చి ఆమె లండన్ వెళ్తుంది. కానీ ఆమె భర్త మాత్రం ఆ డబ్బును హీరో కుటుంబానికి ఇవ్వకుండా తన స్వార్థంతో కూతురి పేరిట ఆస్తులు కొని లండన్ వెళ్తాడు. చాలా ఏళ్ల తర్వాత అసలు విషయం తెలిసిన ఆమె బాధతోనే విదేశాల్లోనే కన్నుమూస్తుంది. చనిపోయే ముందు తన కూతురైన నందిని (అనుపమ)కి అసలు విషయం చెబుతుంది.
తన తల్లి ప్రాణాలను కాపాడిన అబ్బాయిని వెతుక్కుంటూ ఇండియా వచ్చిన నందిని హీరో తేజ్‌తో ప్రేమలో పడుతుంది. ప్రపోజ్ చేయడానికి వెళ్తూ యాక్సిడెంట్‌లో గతాన్ని మర్చిపోతుంది. తర్వాత హీరోయిన్ ప్రేమను హీరో ఎలా పొందగలిగాడు? తను వెతుకుతున్న అబ్బాయి హీరోనే అని హీరోయిన్ ఎలా తెలుసుకుంది? బాబాయి కూతురికి ప్రేమ పెళ్లి చేసి కుటుంబానికి దూరమైన హీరో మళ్లీ తన వాళ్లకు ఎలా దగ్గరయ్యాడు? అనేది స్థూలంగా ఈ సినిమా కథ. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా లవ్ స్టోరీకి ఉమ్మడి కుటుంబ అనుబంధాలను జోడించి ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కరుణాకరన్.
సినిమా ఎలా ఉందంటే..
హీరో తన కజిన్‌కి పెళ్లి చేయడం, ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం ఇవన్నీ చాలా సినిమాల్లో చూసిందే. తర్వాత హీరోయిన్‌ను చూసి ప్రేమలో పడటం, వారిద్దరూ ఒకరిపై మరొకరు రివేంజ్ తీర్చుకోవడంతో ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది. తొలి భాగంలో ఎక్కడా మనసును కట్టి పడేసే సన్నివేశాలు లేకున్నా బోరుగా ఫీలవకుండా చూడటం వరకు దర్శకుడు సక్సెస్ అయ్యాడు. హీరో ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు వెళ్తూ హీరోయిన్ యాక్సిడెంట్‌కు గురై గతాన్ని మర్చిపోతుందనే ఇంటర్వెల్ ట్విస్ట్‌తో దర్శకుడు ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్ మరింత గ్రిప్పింగ్‌గా, ఆకట్టుకునేలా ఉంటే బాగుండేది. కానీ ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేయడంలో కరుణాకరన్ విఫలమయ్యాడు.
చదవండి:
తను ఇండియాకు వచ్చిన దగ్గర్నుంచి జరిగిన విషయాలను మాత్రమే హీరోయిన్ మర్చిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలపై డైరెక్టర్ ఫోకస్ పెట్టడంతో టైం పూర్తిగా ఇక్కడే గడిచిపోయింది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సనివేశాల్లో కామెడీ డోస్ మరింతగా ఉంటే బాగుండేది. ప్రి క్లమాయిక్స్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్‌ను పండించే ప్రయత్నంలో, భావోద్వేగాలతో కట్టి పడేయడంలో డైరెక్టర్ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.
ఎవరెలా చేశారంటే..
హీరో సాయి ధరమ్, అనుపమ పరమేశ్వరన్ బాగా నటించారు. నందిని పాత్రలో అనుపమ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇంట్లో చెల్లెళ్లతో, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపే యువకుడిగా తేజ్ పాత్రలో సాయి మెప్పించాడు. హీరో పెదనాన్నగా జయప్రకాష్, పెద్దమ్మగా పవిత్రా లోకేష్ నటన ఆకట్టుకునేలా ఉంది. హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. తేజ్ పిన్నిగా వాణి సురేఖ, బాబాయిగా పృథ్వీ తమ పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. కానీ హీరోయిన్ తండ్రిగా కీలక పాత్రలో నటించిన అనిష్ కురువిల్ల పాత్రకు చివర్లో పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది.
సాంకేతిక విభాగం
ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్‌గా సినిమాను నిర్మించారు. గోపీ సుందర్ మ్యూజిక్ బాగుంది. రెండు పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాట్రోగ్రాఫర్ ఆండ్రూ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. హీరోయిన్ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ ఫర్వాలేదనిపించాడు. కానీ రొటీన్ కథ, దారి తప్పిన కథనంతో తన మార్క్ చూపించలేకపోయాడు. ప్రేక్షకుడిని కన్విన్స్ చేయలేకపోయాడు.
చివరిగా
భారీ అంచనాలను అందుకోవడంలో, తన గత సినిమాల మ్యాజిక్‌ను రిపీట్ చేయడంలో డైరెక్టర్ కరుణాకరన్ సక్సెస్ కాలేకపోయాడు. కానీ పెద్దగా బోర్ కొట్టకుండా, సరదాగా చూడాలని అనుకునే వాళ్లు మాత్రం ఓసారి తేజ్‌ను చూసేయొచ్చు. కానీ తొలిప్రేమ లాంటి అద్భుతమైన సినిమాను కరుణాకరన్ నుంచి ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సినిమాలో ఓ సందర్భంలో హీరో చెప్పినట్టే ‘తేజ్’ తొలి ప్రేమకథ బ్లైండ్‌గా ముగిసింది.
Story:
Tej (Sai Dharam Tej) and Nandini (Anupama Parameswaran) loves each other. When Nandini is about to reveal her love to Tej, an accident shakes her life upside down. What happen then? Forms the story of the film.
Performances:
Verdict:
Mass
ReplyDelete