Love in a beautiful emotion often explored in Tollywood, rarely with equally beautiful results. ‘Ee Maya Peremito’ is a film in the disguise of a love story that only wants to set Rahul Vijay up as a hero and not an actor. He gets the slow-motion intro, chugging beer while jumping on a trampoline like the ‘rebel’ his tee-shirt proclaims him to be. He gets ample opportunity to show off his dreamy dance moves for songs that don’t require it and enough dialogues that talk of his height and beauty. But what he gets the most out of the film is the constant reminder of how good a person his character Chandu is, with a fight or two thrown in for good measure. He’s also enabled to be himself by his father Babu Rao (Rajendra Prasad) who loves his son however he is.
Kavya Thapar on the other hand gets close-up shots with her hair constantly billowing in non-existent wind. But other than that, neither she nor her character Sheetal seems to have the power of choice in the film. Her father lists out the kind of men he wants for his daughter even while she’s still in school, her choice be damned. There’s talk of Chandhu being a jobless vagabond and it’s especially ironical when it comes from a father whose daughter seems particularly jobless too. Other than mooning around the hero and later pouting when he has no time to spend with her in the middle of the afternoon because he’s busy with a job he oh-so-easily acquired, she really has nothing much to do in the film. The way her character is treated in the film becomes especially regressive when Babu Rao tells his son, “Valaki santosham badha anni maname ra,” implying her father and later the hero is whom her world revolves around.
‘Ee Maya Peremito’ runs on an often explored retro template of a father deeming the hero unworthy of his daughter and the hero doing everything in his power to prove otherwise. Except, it does nothing different to set itself apart and make us care about characters that remain flat all through the film. Riddled with clichés, unmemorable scenes and predictability, the film is a test to the viewer’s patience. The plotline is so unoriginal, it even makes Murli Sharma bring out his inner Chandramouli from ‘Ninnu Kori’ to question the hero’s arahata in a scene.
Rahul Vijay seems to be another Raj Tarun in the making, in the sense that the only emotion he can seem to portray is a wide smile. The only other emotion he conveys in the film is when his pretty face crinkles slightly when he’s confused or sad. He does however know how to shake a leg. Kavya Thapar is good enough in her role, except she’s handed the short end of the straw here, despite having decent screen time. Murli Sharma and Rajendra Prasad too do the best with what they’re offered.
‘Ee Maya Peremito’ is a simple story that seems to drag on despite the short run-time. All it manages to do, is be a decent watch. Better luck next time!
నూతన దర్శకుడు రాము కొప్పుల దర్శకత్వంలో, ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు ‘రాహుల్ విజయ్’ హీరోగా రూపొందిన చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. రాహుల్ సరసన కావ్య తపార్ హీరోయిన్ గా నటిస్తోంది. వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ బేనర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ రోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
చందు (రాహుల్ విజయ్) కాలనీలో ఫ్రెండ్స్ తో సరదగా ఖాళీగా తిరుగుతుంటాడు. కానీ అందరికీ సహాయపడుతూ మంచి కుర్రాడిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా చందు మంచితనం గమనించిన సీతల్ (కావ్య తపార్) ఇంప్రెస్ అయి… ప్రేమించడానికి చందు గురించి అతని కాలనీలో ఎంక్వేరి చేస్తోంది. ఫైనల్ గా అతన్ని ప్రేమిస్తోంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనలు అనంతరం ఇద్దరూ ప్రేమించుకుంటారు. కలిసి తిరుగుతారు. ఈ విషయం తెలిసిన సీతల్ ఫాదర్ (మురళి శర్మ) ఏ తండ్రి అయినా తన కూతురుకి ఎలాంటి భర్త రావాలని కోరుకుంటాడో.. ఆ విషయం గురించి చందుకి అర్ధమయ్యేలా తెలివిగా ఎమోషనల్ చెప్తాడు. అలా నువ్వు మారితే నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు.
చందు (రాహుల్ విజయ్) కాలనీలో ఫ్రెండ్స్ తో సరదగా ఖాళీగా తిరుగుతుంటాడు. కానీ అందరికీ సహాయపడుతూ మంచి కుర్రాడిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా చందు మంచితనం గమనించిన సీతల్ (కావ్య తపార్) ఇంప్రెస్ అయి… ప్రేమించడానికి చందు గురించి అతని కాలనీలో ఎంక్వేరి చేస్తోంది. ఫైనల్ గా అతన్ని ప్రేమిస్తోంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనలు అనంతరం ఇద్దరూ ప్రేమించుకుంటారు. కలిసి తిరుగుతారు. ఈ విషయం తెలిసిన సీతల్ ఫాదర్ (మురళి శర్మ) ఏ తండ్రి అయినా తన కూతురుకి ఎలాంటి భర్త రావాలని కోరుకుంటాడో.. ఆ విషయం గురించి చందుకి అర్ధమయ్యేలా తెలివిగా ఎమోషనల్ చెప్తాడు. అలా నువ్వు మారితే నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు.
దాంతో.. చందు, సీతల్ కోసం తన లైఫ్ స్టైల్ ని మార్చుకుంటాడు. అలా తనని తాను మార్చుకుంటున్న క్రమంలో సీతల్ కి చందు నచ్చడు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. సీతల్ కి వేరే పెళ్లి ఫిక్స్ అవుతుంది. సీతల్ కి చందు నచ్చకపోవటానికి రీజన్ ఏమిటి ? అసలు మురళి శర్మ చందుకి ఏం చెబుతాడు ? అనంతరం చందు ఏం చేస్తాడు ? చివరకి సీతల్ చందుని అర్ధం చేసుకుంటుందా ? తిరిగి ప్రేమిస్తుందా ? వారి పెళ్లి జరుగుతుందా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్ర హీరో రాహుల్ విజయ్ కి మొదటి సినిమా అయినప్పటికీ అతని లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. ఓ కాలనీలో సరదాగా తిరిగే ఓ కుర్రాడి పాత్రలో.. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా హీరోయిన్ తో సాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో గాని, తన మదర్ కి తనకి మధ్య వచ్చే సన్నివేశంలో గాని రాహుల్ విజయ్ చాలా చక్కగా నటించాడు.
రాహుల్ సరసన హీరోయిన్ గా నటించిన కావ్య తపార్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కావ్య తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. హీరోయిన్ ఫాదర్ గా నటించిన మురళి శర్మ తన కెరీర్ లోనే మరో గుర్తు పెట్టుకున్నే పాత్ర చేశారు. అలాగే కొడుకుని అమితంగా ప్రేమించే ఫాదర్ రోల్ లో కనిపించిన రాజేంద్ర ప్రసాద్ కూడా తన నటనతో నవ్విస్తూనే, ఇటు ఎమోషన్ సీన్స్ ని కూడా బాగా పండించారు.
ఇక సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.
మైనస్ పాయింట్స్
సినిమా అక్కడక్కడ సరదాగా సాగిన, ఓవరాల్ గా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. దానికి తోడు సినిమాలో ప్లో ఉండదు. ఫస్ట్ హాఫ్ లో ఒక్క ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సన్నివేశాలు అన్నీ ఫోర్స్ డ్ గా తీసుకొచ్చి పెట్టినట్లు అనిపిస్తోంది. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు ఎక్కడా ఆ ఎమోషన్ గాని, ఆ ఫీల్ గాని ఆడియన్స్ ఫీల్ అవ్వడు.వీటికి కొన్ని సన్నివేశాల్లో మరీ నాటకీయంగా సాగుతుంది.
ఈ రెగ్యూలర్ లవ్ స్టోరీలో బలహీనమైన పాత్రలతో (ఒక్క మురళి శర్మ పాత్ర తప్ప) కొన్ని భావోద్వేగ సన్నివేశాలను పండించడానికి దర్శకుడు కథనంలో అనవసరమైన సీన్స్ పెట్టి విసిగిస్తాడు. పైగా ఆ సీన్స్ కూడా ఎక్కడా హృదయానికి హత్తుకున్నే విధంగా ఉండకపోగా.. చాలా చోట్ల సినిమాటెక్ గా సాగుతూ.. చాలా ప్రెడిక్టుబుల్ గా అనిపిస్తాయి.
లవ్ అండ్ రొమాంటింక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో.. ప్రేక్షకులను ఇటు పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే లవ్ ఉండదు, అటు పగలబడి నవ్వుకున్నే ఎంటర్ టైన్మెంట్ ఉండదు. దర్శకుడు అనవసరమైన సీన్స్ జోలికి పోకుండా.. లవ్ స్టోరీ మంచి కాన్ ఫ్లిక్ట్ పెట్టి ఉండి ఉంటే మంచి లవ్ స్టోరీ అన్నా ప్రేక్షకులను ఆకట్టుకున్నేది.
సాంకేతిక విభాగం :
రాము కొప్పుల స్క్రిప్ట్ ను పేపర్ మీద రాసుకున్నంత బాగా.. స్క్రీన్ మీదకు తెరకెక్కించలేకపోయారు. సంగీత దర్శకుడు మణిశర్మ సమకూర్చున పాటలు ఆయన స్థాయిలో లేకపోయినా పర్వాలేదనిపిస్తాయి. మెయిన్ గా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది.
శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఎక్కడా బ్యూటి తగ్గకుండా మంచి విజువల్ గా చిత్రీకరించారు. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సినిమాలో కథకు అవసరం లేకుండా వచ్చే కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.
ఈ చిత్ర నిర్మాత దివ్య విజయ్ పాటించిన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఆమె ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రానికి అవసరమైన దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టారు.
తీర్పు
దర్శకుడు రాము కొప్పుల స్క్రిప్టుని ఇంకా పగడ్బందీగా రాసుకొని ఉండి ఉంటే…ఈ చిత్రం ఓ మంచి లవ్ అండ్ ఎంటర్ టైనర్ అయి ఉండేది. రాహుల్ విజయ్ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. యాక్టింగ్ పరంగా కూడా చక్కగా నటించాడు. కానీ హీరో హీరోయిన్ల ప్రేమ కథ, ఇద్దరి మధ్య సాగే కొన్ని సన్నివేశాలు బలంగా లేకపోవడం, వీటికి తోడు నెమ్మదిగా సాగే కథనం, కొన్ని సీన్స్ కన్వీన్స్ గా అనిపించకపోవడం లాంటి కారణాలతో సినిమా ఆసక్తికరంగా సాగదు. ఓవరాల్ గా లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకొన్నే విధంగా లేదు. అయితే రాహుల్ విజయ్ కి మాత్రం తన టాలెంట్ చూపించుకోవడానికి ఈ సినిమా పనికొస్తోంది.
I like it
ReplyDelete