There’s a telling scene the film begins with, a bus filled with people who keep talking of Arun, an unseen individual whom all the strangers on the bus seem to know. Right then and there you know that you’re dealing with someone who’s prone to holding grudges and is willing to wait for a long time to extract his revenge, even if it means waiting for them to reach Kulu from Hyderabad. Why exactly does this man wait till they reach there and why now after so many years, you wonder, waiting for a plausible explanation to come through. And when it does come, you expect it to blow you away. But, does it?
Vikram (Naga Chaitanya) is the quintessential youngster with a happy family consisting of his sister (Bhumika), brother-in-law and loving niece Maha, whom he believes to be the reincarnation of his mother. Unfortunately for him, his family also consists of his twin Aditya, whom he absorbed before birth. Aditya is the polar opposite of Vikram, where the latter grabs pens and patiently woos women, the former is prone to to grabbing knives and slapping women on their bottoms – because why not, right? Aditya also likes to protect Vikram once in a while, when he’s not too busy getting him into trouble.
The love of Vikram’s life is Chitra (Nidhhi Agerwal), an old flame from college who now runs an antique store, filled with nostalgic pieces from the 80s and 90s. After hate-turned-to-love and misunderstandings galore, everything in Vikram’s life seems to be finally in place, except it’s not. Out to ruin him and his family is Arun (Madhavan), the cherubic looking evil incarnate, who thankfully steers clear of cliché by making his girlfriend a target too. When it’s revealed why exactly Arun holds a grudge, it unfortunately comes as a fizzle instead of a bang.
In a tale where both the Savyasachi Vikram-Aditya and his evil counterpart Arun are important, simply not enough time is spent on building the character of the latter. In fact, the whole of the lengthy first half takes its own sweet time to establish the point. Despite the exciting start, proceedings turn slow with more than enough time spent on singing duets, romancing Chitra across two continents, leaning on family sentiment and a flashback establishing his childhood and the vanishing twin syndrome. Despite the few laughs peppered in between, thanks to Vennela Kishore and Shakalaka Shankar, one just powers through waiting for the film to get to the point.
And when it does get to it in the second half, the film still tries too hard to keep Chitra in the fold by injecting a tense narrative with yet another duet out of nowhere. At the end of it all, not enough time is simply spent on the cat and mouse game between Vikram and Arun. Whatever time is spent fails to make it engaging due to the dull narrative and the dynamics between the duo seems to run more on sheer luck than intelligence. An edge-of-the-seat thriller it is not.
What works for the film are the crisp visuals by Yuvaraj, MM Keeravani’s music, and a few fights by Ram-Laxman which extract all the juice of the seemingly superhuman left hand. While Naga Chaitanya struggles with his facial expressions, not bringing the pain through in his blank face when needed, Madhavan aces through his role, despite it being underwritten and hastily explained away. Nidhhi Agerwal and Bhumika do the best with what they’re offered, so do Rao Ramesh and Thagubothu Ramesh.
Watch this one if you’re a Naga Chaitanya or Madhavan fan, but definitely leave your brains at home for this one.
మరోవైపు అరుణ్ రాజ్(మాధవన్) ఎంతో మేధావి. కానీ అతన్ని ఎవరైనా విమర్శించినా, తను కావాలనుకున్నదాన్ని ఎవరైనా దూరం చేసినా తట్టుకోలేడు. వారిని చంపడానికి కూడా వెనకాడడు. అలాంటి వ్యక్తి విక్రమ్ ఆదిత్య కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. వాళ్లని అంతం చేయాలనుకుంటాడు. విక్రమ్ బావని చంపేస్తాడు. విక్రమ్‌తో అతని అక్క(భూమిక), పాపని కూడా చంపేయాలనుకుంటాడు. అసలు అరుణ్‌కు విక్రమ్ కుటుంబాన్ని చంపాల్సిన అవసరమేంటి? అరుణ్‌ను విక్రమ్ ఎలా ఎదుర్కొన్నాడు? తన అక్క, మేనకోడలిని ఎలా కాపాడుకున్నాడు? ఈ థ్రిల్లర్ డ్రామాలో చిత్ర(నిధి అగర్వాల్) పాత్రేమిటి? అనేదే సినిమా.
అసలు కాన్సెప్టే చాలా కొత్తగా ఉంది. అవిభక్త కవలలుగా పుట్టాల్సిన ఇద్దరు ఒకరిగా కలిసిపోవడం.. లోపలున్న మరో వ్యక్తి బయటికి కనిపించే వ్యక్తికి తెలియకుండా స్పందించడం.. భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి కాన్సెప్ట్‌ను దర్శకుడు సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. కథనం చాలా సాదాసీదాగా ఉంది. తొలి భాగంలో హీరో పరిచయం, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ, కొన్ని ఆసక్తికర సన్నివేశాలతో బాగానే నడిపించారు. ఇంటర్వల్ చూసిన ప్రేక్షకుడు ఇక సెకండాఫ్‌లో విలన్, హీరోల మధ్య గేమ్ అదిరిపోతుందని భావిస్తాడు. కానీ ఆ క్యూరియాసిటీని కొనసాగించడంలో దర్శకుడు విఫలమయ్యారు.
సెకండాఫ్ బాగాలేదు అని చెప్పలేం. కాకపోతే సంతృప్తికరంగా లేదు. విలన్, హీరో మధ్య మైండ్ గేమ్‌ను దర్శకుడు ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది. స్క్రీన్‌ప్లే ప్రధానమైన ఇలాంటి మైండ్ గేమ్‌లో అదే ప్రధాన లోపంగా కనిపించింది. సీరియస్ సాగే థ్రిల్లర్ గేమ్‌లో ‘శుభద్ర పరిణయం’ నాటకాన్ని చొప్పించడం ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తుంది. వాస్తవానికి ప్రేక్షకుడికి వినోదం పంచడానికి దర్శకుడు ఆ సన్నివేశం పెట్టి ఉండొచ్చు. ఆ నాటకం సన్నివేశాన్ని విడిగా చూస్తే నచ్చుతుంది. కానీ కథలో భాగంగా ప్రేక్షకుడు అంగీకరించలేడు. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉన్నందుకు సెకండాఫ్ ఆసక్తికరంగా ఉండుంటే సినిమా స్థాయి మరోలా ఉండేది.
సినిమాలో ప్రేక్షకుడు బాగా కనెక్ట్ అయ్యేది ‘ఎడమచేతి’ ఎమోషన్‌కి. విక్రమ్ ఆపదలో ఉన్నప్పుడు, ఎక్కువగా ఆనందం పొందుతున్నప్పుడు ఎడమచేయి స్పందించే తీరు ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆ కాన్సెప్ట్ బాగా పండింది. దీనికి తోడు కీరవాణి నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. నాగచైతన్య, నిధి అగర్వాల్ కెమిస్ట్రీ బాగుంది. వీరిద్దరి ప్రేమకథను కొంచెం సాగదీశారేమో అనిపిస్తుంది. న్యూయార్క్‌లో సత్తిబాబు లవంగం(షకలక శంకర్) కామెడీ బాగా పండింది. వచ్చీరానీ ఇంగ్లిష్‌లో శంకర్ బాగా నవ్వించాడు. ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన మరో విషయం డైలాగులు. చందు మొండేటి చాలా బాగా రాశారు.
సినిమాలో రెండు పాత్రలు కీలకం. ఒకటి విక్రమ్.. మరొకటి అరుణ్. విక్రమ్ పాత్రకు నాగచైతన్య పూర్తి న్యాయం చేశాడు. ఎప్పటిలానే మంచి ఎనర్జీతో చైతూ నటించాడు. ఫైట్లు ఇరగదీశాడు. డ్యాన్స్ కూడా బాగా చేశాడు. ముఖ్యంగా ‘నిన్ను రోడ్డు మీద’ పాటలో చైతూ డ్యాన్స్ బాగుంది. ఇక అరుణ్ పాత్రలో మాధవన్ తన క్రూరత్వాన్ని చూపించారు. తెలుగులో తొలిసారి నటించిన ఈ మాజీ లవర్ బాయ్.. విలన్ పాత్రలో మెప్పించే ప్రయత్నం చేశారు. ఆయన పాత్ర మరీ గొప్పగా ఉందని చెప్పలేం కానీ.. ఉన్నంతలో బాగానే చేశారు. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిధి అగర్వాల్.. చిత్ర పాత్రలో ఇమిడిపోయింది. ఆమె నటనలో ఎలాంటి ఇబ్బంది కనిపించలేదు. డ్యాన్సులు కూడా చాలా బాగా చేసింది. భూమిక, వెన్నెల కిషోర్, సత్య, విద్యుల్లేఖ రామన్, రావు రమేశ్, తాగుబోతు రమేశ్, షకలక శంకర్, భరత్ రెడ్డి తమ పాత్రల పరిధి మేర నటించారు.
టెక్నికల్ టీమ్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు కీరవాణి గురించి. భావోద్వేగ సన్నివేశాల్లో ప్రేక్షకుడు కంటతడి పెట్టాడంటే దానికి కారణం కీరవాణి నేపథ్య సంగీతం. అంత గొప్పగా ఇచ్చారాయన. పాటలు కూడా బాగున్నాయి. ఇక జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్. హీరో హీరోయిన్లను చాలా అందంగా చూపించారు. అలాగే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా బాగుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇదో వైవిధ్యమైన చిత్రం. ‘మేధావి తన తెలివిని మంచి కోసం వాడాలి కానీ, వినాశనం కోసం కాదు.. అలాంటి మేధావితనం అతన్నే నాశనం చేస్తుంది’ అనేది చిత్ర సారాంశం. వినోదం, భావోద్వేగం, యాక్షన్ ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. దీనికి మంచి కథనం తోడై ఉంటే ఇంకా బాగుండేది.
Good movie
ReplyDelete