Agent Sai Srinivasa Athreya is a brilliantly executed, no nonsense film which makes it clear from get-go about the kind of story it wants to tell. This is not the kind of film that will pander to a commercial audience, nor is it the kind of film which will allow itself to be diluted with unnecessary tropes. There will be no feel-good moments to make your chest untighten when the gristly core of the story shows it face nor there any relief at the end to make it seem that everything is right in the world. This is exactly why Agent Sai Srinivasa Athreya is the kind of film that needs to be seen with a story that needs to be told.
Agent Athreya (Naveen Polishetty) is a detective grieving his dead mother and running a detective agency called FBI (you will want to watch the film to know why it’s named as such) from a vegetable market in Nellore. In the confines of peeling wall paint and flickering bulbs, Agent Athreya and his assistant Sneha (Sruthi) solve cases that are clearly beneath him, but it’s all he can get. He believes his reputation precedes him and his brilliant yet humorous mind yearns for complicated cases. In midst of an un-ideal situation, Agent Athreya happens to chance upon just that – a heart-wrenching case that’s worth his time if only for the grieving father. But as he begins joining the dots, something far more sinister is unearthed.
Agent Sai Srinivasa Athreya is the kind of film that acts like a slow burn. You go in expecting a few jokes here and there and maybe a case that’s not as complicated as the one you’re shown, but something that our hero manages to solve and save the day. And that’s how it begins too. The film takes its own sweet time giving you details you don’t know you will need later and setting up characters, especially with Agent Athreya’s backstory. The pace honestly makes one impatient and you truly wonder why you’re being given all these details that have nothing to do with the case at hand. But director Swaroop and Naveen (who co-wrote the screenplay) manage to pull the carpet right from under your feet and you’re left wondering what you just played witness to. To reveal anything more about the tale would be a great injustice, for it is something that truly needs to be seen on-screen.
Films like these – a true-blue detective thriller – are usually let down by loopholes, especially when they’re based on crime that takes place in real life every day. Does Agent Sai Srinivasa Athreya have no loopholes? Maybe it does, but Swaroop and Naveen keep you so busy; you really don’t have time to think about it all, even during the draggy bits. Naveen makes a fantastic debut as a lead with this one and truly seems to live in the skin of his character. There’s not one scene that makes you seem like he’s out of place and while he unsurprisingly aces through the humorous bits, it’s the scenes that require him to show emotion that catches you unaware. Shruti as Sneha is really good, but this is Naveen and his character Athreya’s show all the way. Suhas makes an impressive cameo as Detective Bobby, Athreya’s Tamil counterpart.
While Swaroop delivers a sound film, Mark K Robin’s music and Sunny Kurapati’s cinematography help set the mood in many scenes. Watch the film this weekend if no-frills detective thrillers are your cup of tea; watch this one ever more so if you’re jonesing for some for something fresh that’ll make you think. You won’t regret it!
కథ:ఆత్రేయ (నవీన్ పోలిశెట్టి) నెల్లూరు కేంద్రంగా చిన్నాచితకా కేసులను పరిష్కరించే, అంతగా పేరులేని ఓ డిటెక్టీవ్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ పెద్ద కేసుని ఇన్వెస్టిగేట్ చేసి మంచి పేరు తెచ్చుకొని జీవితంలో స్థిర పడాలి అని ఎదురుచూస్తున్న ఆత్రేయకు అనుకోకుండా ఒకరోజు రైలు పట్టాల ప్రక్కన అనుమానాదాస్పద స్థితిలో శవంగా మారిన ఓ యువతి కేసును ఛేదించే అవకాశం దక్కుతుంది. దానితో ఆ యువతి మరణం వెనుక వున్న వాస్తవాలను ఛేదించే దిశగా ఆత్రేయ తన విచారణ మొదలు పెడతాడు. ఆ యువతిని చంపిన ఆ నేరస్తులు ఎవరు ? ఈ కేసులోని చిక్కుముడులను ఆత్రేయ ఎలా ఛేదిస్తాడు ? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:ఈ మూవీకి ప్రధాన బలం దర్శకుడు మూవీ కొరకు ఎంచుకున్న సబ్జెక్టు. కనిపించకుండా పోయి శవమై తేలిన వ్యక్తులకు సంబందించిన కేసును ఒక చిన్న డిటెక్టీవ్ ఛేదించిన విధానం కొత్తగా ఉంది.
హీరోగా నవీన్ కి మంచి ఆరంభం లభించిందని చెప్పాలి. వైవిధ్యం తో పాటు భిన్న కోణాలున్న తన పాత్రను చక్కగా పోషించాడు. హాస్యసన్నివేశాలలో తో పాటు సీరియస్ సన్నివేశాలలో కూడా అతని నటన కట్టిపడేసేలా ఉంది.
హీరోకి అన్నివేళలా తోడుగా ఉంటూ తన ఇన్వెస్టిగేషన్ లో తన వంతు సాయం చేసే అసిస్టెంట్ పాత్రలో హీరోయిన్ శృతి శర్మ యాక్టింగ్ బాగుంది. ఇక ప్రధాన పాత్రలలో కనిపించిన మిగతా నటులందరూ కొత్తవారైనప్పటికీ తమ పరిధిలో వారు నటించి మెప్పించారు. చివరి 10నిమిషాల వరకు కూడా కథలో సస్పెన్సు క్యారీ ఐయ్యేలా కథనం చక్కగా కుదిరింది.
సినిమాలోని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు మరో అదనపు ఆకర్షణ, అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. హాస్య సన్నివేశాలలో నవీన్ నటన ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు నవీన్ పై తెరకెక్కిన కామెడీ సన్నివేశాలను ని బాగా ఎంజాయ్ చేస్తారు. చిత్రీకరణకు ఎంచుకున్న ప్రదేశాలు,అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఇంప్రెస్ చేస్తాయి.
మైనస్ పాయింట్స్:చివరి 15నిమిషాలు డైరెక్టర్ కథను సాగదీశాడనిపిస్తుంది. కథలో అసలు ట్విస్ట్ తెలిసిపోయాక కూడా అనవసర సన్నివేశాలతో మూవీ నెమ్మదించేలా చేశాడు.
చాల సన్నివేశాలు సాగదీతలా అనిపించడంలో ఎడిటింగ్ వైఫల్యం కనపడుతుంది. ఒక పది నిమిషాల అనవసర నిడివి తగ్గిస్తే ఇంకా సినిమా బాగుండేది.
కేసుల విషయంలో పోలీసులు అంతగా పేరులోని ఓ చిన్న ఏజెంట్ ఆత్రేయ హెల్ప్ తీసుకోవడం అనేది కొంచెం నమ్మబుద్ది కాదు, వాస్తవికతకు అంతగా దగ్గరగా అనిపించదు.
సాంకేతిక విభాగం:సాంకేతికంగా సినిమా ఉన్నత ప్రమాణాలతో తెరక్కెక్కించారు. అద్భుతమైన విజువల్స్ కెమెరామెన్ పనితనాన్ని తెలియజేస్తాయి. అలాగే సందర్భానుసారంగా వచ్చే డైలాగులు, సన్నివేశాలకు ఫీల్ తెచ్చేలా బి.జి.ఎం బాగా కుదిరాయి. మూవీ లైటింగ్ ఉత్కంఠ రేపే సన్నివేశాలకు వన్నె తెచ్చేలా ఉంది. ఇక డైరెక్టర్ స్వరూప్ మొదటి సినిమాతోనే తన టాలెంట్ తో ప్రేక్షకులకు మంచి సినిమా అందించారు. కష్టతరమైన థ్రిల్లింగ్ స్టోరీని అర్ధమయ్యే విధంగా తెరపై చక్కగా ఆవిష్కరించాడు. ప్రతి సన్నివేశాన్ని సునిశిత పరిశీలనతో తెరకెక్కించినట్లు ఉంది. చివరి 15నిముషాలు మినహాయిస్తే సినిమా ఆసాంతం ఉత్కంఠ కలిగేలా కథనం నడిపాడు. ఈ మూవీ చూశాక టాలీవుడ్ కి ఓ మంచి దర్శకుడు దొరికాడని భావన రాక మానదు.
తీర్పు:మొత్తంగా చెప్పాలంటే “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” ఆసక్తి కరమైన కథనంతో సాగే ఉత్కంఠ రేపే ఓ మంచి కామెడీ థ్రిల్లర్. ఆకట్టుకునే నటనతో పాటు, మంచి డైలాగ్ డిక్షన్ తో నవీన్ పోలిశెట్టి హీరోగా తన మొదటి సినిమాతోనే మంచి ప్రభావం చూపాడు. వాస్తవికతకు దగ్గరగా ఉండే ఆసక్తికరమైన కథనం ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. చివరి 10నిమిషాలు మినహాయించి, ప్రేక్షకుడికి కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ వారాంతపు సెలవులు ఓ మంచి మూవీతో ముగించాలనుకునే వారికి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ బెస్ట్ చాయిస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Comments
Post a Comment