Voter is a film that aims to make the janata of India open their eyes to the power they hold in their hands. Be it the power to cast the right vote or to rercall it when unsatisfied with their elected leader, the film aims to make it clear that it is with the inked finger that the power lies. Had the film released before elections, maybe it would’ve been more relevant. But with the concept of re-call, it holds true now too. Except, the film is stretched so much even in its short run-time that things begin to get extremely repetitive. There’s only two numbers in the film but even those two begin to feel like too much.
Gautam (Vishnu Manchu) is an NRI techie his colleagues and boss seem impressed with in the one scene he gets with them. He visits India to cast his vote, harass, stalk and grope a stranger all while singing how he’s ‘6 Feet Tall’. Said stranger Bhavana’s (Surbhi) only fault and misfortune is that she happened to ask his help when police cordon off a road to let a minister pass by. After a million no’s from her side go unacknowledged; with Gautam making it his full-time job to follow her everywhere, Bhavana asks him to make the local MLA (Posani Krishna Murli) fulfil his election promises if he wants to win her, just to get him off her back. And hence, Gautam sets on a journey to make the local MLA and politician Bhanu Shankar (Sampath) realise their place in the world, as nothing but a public servant, if only to win over his girl and avenge his sister.
Just when Gautam gets past harassing Bhavana and into the thick of things, you just wait and wait for something novel to happen, but nothing really does. Voter is a film that’s extremely obsessed with social media as if it’s the early 2000s and indulges in the same old cat-and-mouse games that make you yawn. And as Gautam keeps muttering, “Outdated rajakeeyalu maaneyandi,” (you need to stop with the outdated politics) the audience is just left hoping filmmakers stop with the outdated scripts. Sadly there’s nothing worth appreciable on the technical side of the film too. This one’s a huge let-down.
కథ :యూఎస్ లో జాబ్ చేస్తోన్న గౌతమ్ (మంచు విష్ణు) ఓటు వేయడానికి ఇండియా వస్తాడు. అయితే అనుకోకుండా సురభిని చూసి ప్రేమలో పడతాడు. అయితే సురభి తను ఇచ్చిన టాస్క్ పూర్తి చేస్తేనే ప్రేమను అంగీకరిస్తానంటుంది. అయితే ఆ టాస్క్ ను గౌతమ్ పూర్తి చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం సెంటరల్ మినిస్టర్ (సంపత్ రాజ్) పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టే స్థలాన్ని కబ్జా చేస్తాడు. ఆ స్థలాన్ని తిరిగి పేదలకు వచ్చేలా చేస్తానని గౌతమ్ ఆ పేదలకు మాట ఇస్తాడు. సెంటరల్ మినిస్టర్ నుండి ఆ ల్యాండ్ లాక్కోవటానికి గౌతమ్ ఏమి చేసాడు ? ఈ మధ్యలో రీకాల్ ఎలెక్షన్ ఎందుకు వచ్చింది ? చివరికి ఆ స్థలం పేదలకు దక్కేలా చేయగలిగాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :ప్రస్తుత రాజకీయాల గురించి సినిమాలో చర్చించిన ‘రీకాల్ ఎలెక్షన్’ అనే మెయిన్ పాయింట్ చాలా బాగుంది. అలాగే రాజకీయ నాయకుల గురించి ఈ చిత్రంలో దర్శకుడు జి కార్తీక్ రెడ్డి ప్రస్తావించిన అంశాలు కూడా ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా జి కార్తీక్ రెడ్డి రాసుకున్న పొలిటికల్ సన్నివేశాలు, ఫస్ట్ హాఫ్ లో వచ్చే పోసాని ట్రాక్.. అలాగే విష్ణు ఇండియా గురించి చెప్పే సన్నివేశం మరియు కొన్ని కీలకమైన సీన్స్ చాలా బాగున్నాయి.
మంచు విష్ణు గత చిత్రాలకు భిన్నంగా ‘ఓటర్’ చిత్రం పక్కా పొలిటికల్ డ్రామాగా సాగడం వల్ల అక్కడక్కడ మంచు విష్ణు లుక్స్ లో యాక్షన్ లో ఫ్రెష్ నెస్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. తన చెల్లిని కాపాడుకునే సన్నివేశంలో విష్ణు చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇక హీరోయిన్ సురభి తన గ్లామర్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంటుంది. విష్ణు – సురభి మధ్య నడిచే లవ్ సీన్స్, వారి మధ్య కెమిస్ట్రీ కూడా కొంతవరకు మెప్పిస్తోంది. సెంటరల్ మినిస్టర్ గా నటించి మెప్పించిన సంపత్ రాజ్ తో కలిపి మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ప్రధానంగా పోసాని తన కామెడీ టైమింగ్ తో నవ్విస్తాడు.
మైనస్ పాయింట్స్ :దర్శకుడు జి కార్తీక్ రెడ్డి రాజకీయాలకు సంబంధించి రీకాల్ ఎలెక్షన్ అనే మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేకపోయారు. అయితే ఆయన రాసుకున్న ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్ గా అనిపిస్తాయి.
ఇక ఒక మినిస్టర్ పై రీకాల్ ఎలెక్షన్ పెట్టే క్రమంలో వచ్చే సీన్స్ ఇంకా బలంగా ఉంటే బాగుండేది. దీనికి తోడు సినిమాలో ఉన్న బలమైన కాన్ ఫ్లిక్ట్ సరిగ్గా ఎలివేట్ కాకపోవడం కూడా.. సినిమా మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. అయితే సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి దర్శకుడు బాగానే ప్రయత్నం చేసినప్పటికీ, మిగిలిన విభాగాల నుండి సరైన సపోర్ట్ లేకపోవడం వల్లే మొత్తానికి అవి సరిగ్గా ఎలివేట్ అవ్వలేదు.
సాంకేతిక విభాగం :సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు జి కార్తీక్ రెడ్డి రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు, అయితే సినిమా మాత్రం ఆసక్తి సాగలేదు. యస్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తోంది. కానీ ఆయన అందించిన పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోవు.
అశ్విన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ప్రవీణ్ కె ఎల్ ఎడిటింగ్ బాగుంది కానీ, సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత జాన్ సుధీర్ పూదోట నిర్మాణ విలువులు బాగున్నాయి.
తీర్పు :మంచు విష్ణు, సురభి జంటగా జి కార్తీక్ రెడ్డి దర్శకతంలో వచ్చిన ఈ పొలిటికల్ డ్రామా కథాంశం పరంగా మరియు కొన్ని రాజకీయ సన్నివేశాల పరంగా ఆకట్టుకున్నప్పటికీ.. సినిమా మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. అయితే సినిమాలో రాజకీయ నాయకుల గురించి ప్రస్తావించిన అంశాలు అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే పోసాని ట్రాక్.. మరియు కొన్ని కీలకమైన సీన్స్ బాగున్నా.. కథనం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. సినిమా నిండా ఎమోషన్ ఉన్నా .. ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా ఆ ఎమోషన్ ఎలివేట్ కాలేదు. దీనికి తోడు ఒక మినిస్టర్ పై రీకాల్ ఎలెక్షన్ పెట్టే క్రమంలో వచ్చే సీన్స్ కూడా బలంగా అనిపించవు. ఓవరాల్ గా ఈ సినిమా పొలిటికల్ జోనర్ లో సినిమాను చూద్దామకునే ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకున్నా.. మిగిలిన ప్రేక్షకులను మాత్రం నిరుత్సాహపరుస్తోంది.
Comments
Post a Comment