After watching Evaru, all questions will be answered, Adivi Sesh told us in an intverview. And sure enough, while Evaru asks plenty of questions, it does give a resounding answer - that the film is indeed inspired by Spanish film, The Invisible Guest. Why the makers kept that under a wraps remains a mystery, but Evaru is a thriller that keeps you hooked right till the end.
Sameera (Regina Cassandra) is accused of murdering a police officer who rapes her. Her lawyer (Vinay Varma) hires a corrupt police officer, Vikram (Adivi Sesh) to help crack the case and defend Sameera against the prosecution lawyer who has the entire department on his side. But an old case handled by Vikram enters the plot, making things seem more complicated than they actually are.
Make no mistake, it's not easy to pull off a thriller of this kind and keep the viewers glued and guessing, especially given how a genre like this isn't explored much in Telugu cinema, and for that Venkat Ramji deserves credit. While the filmmaker makes a few changes to the original, he does manage to keep the suspense impact right till the very end.
However, while the makers manage to connect the dots between each twist and turn, there's something amiss in some of the subplots, and it does feel like the connection isn't seamless. In trying to separate itself from the original, Ramji needlessly creates a subplot and the film ties itself up in knots. One does wonder why the original plot was tinkered with.
The film, however, is lifted by Adivi Sesh who delivers a brilliant performance. Naveen Chandra, too, puts in a solid performance. As the lead character, Regina could've been a touch better and doesn't always convey the impact that her character needs.
Evaru is gripping to the core and has some decent technical values, but the film does lets itself down at times with gaps in the narration. An additional subplot makes it more confusing and doesn't necessarily work, but it's an earnest attempt from Venkat Ramji for his debut film. If you've seen the Invisible Guest or the Hindi film Badla, you'd come out feeling slightly underwhelmed. But if you watch Evaruwith an open mind, it'll end up surprising you.
సమీర (రెజీనా) అశోక్ కృష్ణ (నవీన్ చంద్ర)ను ఊహించని పరిస్థితుల్లో హత్య చేసి, ఆ కేసులో ఇరుక్కుంటుంది. ఆ తరువాత జరిగే సంఘటనల అనంతరం ఈ కేసును ఛేదించేందుకు కరెప్టెడ్ పోలీస్ అధికారి అయినటువంటి అడవి శేషు(విక్రమ్ వాసుదేవ్)రంగంలోకి దిగుతాడు. అతని విచారణలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి.. అలాగే ఓ మిస్సింగ్ కేస్ కి రెజీనాకి ఎలాంటి కనెక్షన్ ఉంటుంది.. చివరికి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడే నిజాలు ఏమిటి ? ఈ నేపథ్యంలో శేషు మరియు రెజీనాల కథకు ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఆ హత్య రెజీనా ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? రెజీనా ఈ కేసు నుంచి బయట పడిందా..? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ సినిమాను వెండి తెరపై చూడాల్సిందే.
క్రైౖమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఓ మిస్సింగ్ కేసు అండ్ ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతూ సప్సెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరియు ఇంట్రస్టింగ్ ప్లేతో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో వినయ్ వర్మ పాత్ర మిస్ అవ్వడం.. ఆ పాత్ర మిస్ అవ్వడానికి గల ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన రెజీనా మరియు నవీన్ చంద్రల పాత్రలు.. ఆ పాత్రల పాయింట్ అఫ్ వ్యూస్ లో వచ్చే ప్లాష్ బ్యాగ్స్… అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే విచారణ సన్నివేశాలు వంటి అంశాలు మరియు అడవి శేషు పాత్రలోని షేడ్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఇక విక్రమ్ వాసుదేవ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన అడవి శేషు తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ సినిమాలో సీరియస్ నెస్ తో పాటు ప్లేలోని ఇంట్రస్ట్ ను తన ఎక్స్ ప్రెషన్స్ తో మెయింటైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన నవీన్ చంద్ర కూడా ఎప్పటిలాగే చాలాబాగా నటించాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రెజీనా తన పాత్రకు తగ్గట్లు, యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో మరియు ప్లాష్ బ్యాక్స్ లో అలాగే కొన్ని బోల్డ్ సీన్స్ లో రెజీనా నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక దర్శకుడు ఈ చిత్రాన్ని ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఆద్యంతం ఉత్కంఠను పెంచుతూ.. చివర్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరియు బలమైన ట్విస్ట్ లతో సినిమాని ముగించడం బాగా ఆకట్టుకుంటుంది.
దర్శకుడు వెంకట్ రామ్‌జీ తీసుకున్న కాన్సెప్ట్ మరియు స్క్రీన్ ప్లే.. అలాగే కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ సీరియస్ గా సాగడం.. దానికి తోడూ కొన్ని సన్నివేశాలు, కొంత తికమకగా అనిపించడం, అక్కడక్కడా కొన్ని సీన్స్ బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమాకి బలహీనతగా నిలుస్తాయి.
పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో ఆ సన్నివేశాల్లో సహజత్వం లోపించినట్లు అనిపిస్తోంది. అలాగే సినిమాలో బిసి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా సినిమా సి సెంటర్ ప్రేక్షకులకు అంత ఈజీగా కనెక్ట్ కాకపోవచ్చు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కెమెరామెన్ గా చేసిన వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని క్రైమ్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలో నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు వెంకట్ రామ్‌జీ మంచి కథాంశంతో పాటు ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకున్నాడు. అయితే కొన్ని సన్నివేశాలతో బోర్ కొట్టించినా ఓవరాల్ గా ఆకట్టుకుంటాడు.
వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేషు హీరోగా రెజీనా కాసాండ్రా హీరోయిన్ గా నవీన్ చంద్ర కీలక పాత్రలో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ ఓ మిస్సింగ్ కేసు మరియు ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతూ సప్సెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరియు ఇంట్రస్టింగ్ ప్లేతో ఆసక్తికరంగా సాగుతుంది. మెయిన్ గా క్రైమ్ సన్నివేశాలు, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు అడవి శేషు – రెజీనా నటన బాగా అలరిస్తాయి. అయితే దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే మరీ సీరియస్ గా సాగడం, పైగా కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమాకి బలహీనతగా నిలిచినా.. ఓవరాల్ గా సినిమా బాగానే అలరిస్తోంది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి అలాగే కొత్తధనం కోరుకునే ప్రేక్షకులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది.
Comments
Post a Comment