Thippara Meesam charts the story of Mani Shankar (Sree Vishnu), who works as a DJ at a night club. He gets addicted to drugs from a very young age and indulges in cricket betting and other illegal games to clear off his debts. He detests his mother Lalitha (Rohini) and often lands in precarious situations.
On paper, the film has a promising premise which has the potential to keep the viewers hooked on to its tale. However, it gets repetitive, predictable and gets lost somewhere along the way.
On paper, the film has a promising premise which has the potential to keep the viewers hooked on to its tale. However, it gets repetitive, predictable and gets lost somewhere along the way.
The story that progresses in a dramatic and convoluted manner, is strewn with blatant plot-holes that make the film far-fetched and unbelievable. Director Krishna Vijay spends the entire first hour to set up its plot and wastes too much time establishing Mani Shankar’s character, thereby never letting you invested in the narrative. This particular hour offers a handful of lump-in-your-throat sequences that are never depicted convincingly to evoke sympathy. The pace at which the story unfolds is askew and the narrative meanders before the inciting moment just before the interval. Except for its emotional climax, the latter half is dull and boring.
The thing about Thippara Meesam is that it is an ordinary story showcasing the turbulent mother-son relationship and is replete with a formula our directors have explored countless times. The director could have at least depicted the agony of a mother right, especially after her life has become miserable due to the humiliation of her son. But he has messed up the emotion with excessive melodrama as she endlessly reiterates the same words she has been telling her son from his childhood days.
Sree Vishnu’s surface-level performance doesn’t help to convey the desperation his character’s supposedly feeling. His character deals with anger-management issues and has an explosive nature like Arjun Reddy, but it’s not as convincing as the latter, owing to his vices. Sample this: the hero’s drug addiction is celebrated with a song composed of a collection of some of the popular dialogues of Telugu cinema. This looks a bit weird due to the director’s penchant to tell this story in a dark tone
అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ,
బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలతో విభిన్నమైన నటుడిగా శ్రీవిష్ణు ప్రేక్షకుల
మదిలో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్నాడు. తాజాగా విలక్షణమైన గెటప్‌తో
తిప్పరా మీసం అంటూ పవర్‌ఫుల్ టైటిల్‌తో నవంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు
వచ్చారు. కృష్ణ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నిక్కి తంబోలి
హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం హీరో విష్ణుతోపాటు దర్శకుడు, చిత్ర
యూనిట్‌కు ఎలాంటి ఫలితాన్ని అందించారనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి
వెళ్లాల్సిందే.
తిప్పరా మీసం కథ
మణి ( శ్రీవిష్ణు) డీజే. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు, కుటుంబానికి దూరంగా
బతుకుతాడు. ఓ కారణంగా తన తల్లి (రోహిణి) అంటే అసహ్యించుకొంటాడు. అలా
ఒంటరితనంతో పెరిగిన మణి జూదం, బెట్టింగులతో కాలం వెళ్లదీస్తూ ఆర్థికంగా
చితికిపోతాడు. ఈ సంఘటనలో కాళి అనే వ్యక్తి మణిని దారుణంగా మోసగిస్తాడు.
ఇలాంటి పరిస్థితుల్లో మణి జీవితంలోకి ట్రైనీ పోలీస్ ఆఫీసర్ మౌనిక (నిక్కి
తంబోలి) ప్రవేశిస్తుంది. కానీ మణి చేసిన ఓ పనికి అతడికి దూరమవుతుంది.
తిప్పరా మీసం ట్విస్టులు
మణి కుటుంబానికి ఎందుకు దూరంగా బతికాడు? తల్లిని అసహ్యించుకోవడానికి
కారణమేమిటి? ప్రేమించిన మౌనికకు దూరం కావడానికి బలమైన కారణమేమిటి? తనను
మోసగించిన కాళిని చివరకు ఏం చేశాడు. బెట్టింగుల వలన కలిగిన అప్పులను ఎలా
తీర్చాడు? చివరకు తన తప్పు తెలుసుకొని తల్లికి దగ్గరయ్యారా అనే ప్రశ్నలకు
సమాధానమే తిప్పరా మీసం కథ.
ఫస్టాఫ్ అనాలిసిస్
తిప్పరా మీసం తొలి భాగం విషయానికి వస్తే.. డ్రగ్స్‌కు మణి ఎందుకు
బానిసయ్యాడు. కుటుంబానికి ఎలా దూరమయ్యాడు. తల్లి, కొడుకుల మధ్య దూరం
పెరగడానికి కారణాలు, చెల్లితో అనుబంధాలు, అలాగే ప్రేయసి మౌనికతో అనుబంధం
లాంటి అంశాలతో కథ ఎలాంటి జోష్ లేకుండా సాగిపోతుంది. కేవలం మణి పాత్రను
ఎస్టాబ్లిష్ చేయడానికే ఫస్టాఫ్ వాడుకోవడం ప్రేక్షకుడి సహనానికి పరీక్షలా
ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు అర్జున్ రెడ్డి ప్రభావానికి గురయ్యాడా
అనే ఫీలింగ్ కలుగుతుంది.
సెకండాఫ్ అనాలిసిస్
ఇక సెకండాఫ్‌లో తన తల్లి (రోహిణి) రాసిన శిశువు అనే పుస్తకం వెనుక ఓ
ట్విస్ట్ సినిమాను కొంత ఎమోషనల్‌గా మారుస్తుంది. ఇక కాళి హత్య వెనుక మరో
ట్విస్టు కూడా ఆసక్తిని రేపుతుంది. కొన్ని ఎమోషనల్ అంశాలతో ఫస్టాఫ్ కంటే
సెకండాఫ్ కొంత బాగుందనే భావన కలిగించడం సినిమాకు కొంత సానుకూలం. ఇప్పటి
వరకు శ్రీ విష్ణును సాఫ్ట్ రోల్స్‌లో చూసిన ప్రేక్షకులకు ఈ సినిమాలో మాస్
ఎలిమెంట్స్ కొత్తగా అనిపిస్తాయి.
డైరెక్టర్ కృష్ణ విజయ్
తల్లి, కొడుకుల ప్రేమానుబంధాలు అనే అంశాన్ని ప్రధానంగా చేసుకొని దానికి
మాస్ ఎలిమెంట్స్‌తోపాటు సమకాలీన యువత పోకడలను జోడించి కథను దర్శకుడు కృష్ణ
విజయ్ రాసుకొన్న తీరు బాగుంటుంది. కానీ కథను నడిపించే తీరులోనే తడబాటు
కనిపించింది. కాకపోతే అర్జున్ రెడ్డి ఇన్‌ఫ్లూయెన్స్‌తో శ్రీవిష్ణు
పాత్రను, గెటప్‌ను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకొంటుంది. కథ, కథనాలపై మరింత
కసరత్తు చేసి ఉంటే సినిమా మంచి ఫలితాన్ని సాధించే అవకాశం ఉండేది.
శ్రీ విష్ణు గురించి
ఇక శ్రీవిష్ణు విషయానికి వస్తే.. మణి పాత్రలో ఒదిగిపోయాడు. మాస్ హీరోగా
మెప్పించేందుకు బలంగా ప్రయత్నించాడు. కానీ కథలో దమ్ము లేకపోవడం, కథనం
పేలవంగా ఉండటంతో తన ప్రతిభ ఎలివేట్ చేసుకొనే అవకాశం లేకుండా పోయింది.
యాక్టర్‌గా విభిన్నమైన పాత్రలను ఎంచుకొనే తపన మరోసారి కొట్టొచ్చినట్టు
కనిపించింది. పక్కింటి కుర్రాడి పాత్ర నుంచి బయటపడి మాస్ ఎలిమెంట్స్
ఆకట్టుకొన్నాడని చెప్పవచ్చు.
మిగితా పాత్రల్లో
హీరోయిన్ నిక్కి తంబోలి క్యారెక్టర్ పరంగా మంచి స్కోప్ ఉన్న పాత్ర. అలాంటి
రోల్‌లో పూర్తిస్థాయిలో ప్రతిభను చాటుకోవడానికి అనుభవం లేమి
కొట్టొచ్చినట్టు కనిపించింది. గ్లామర్ పరంగా ఆకట్టుకొలేకపోయింది.
తల్లిపాత్రలో రోహిణి మరోసారి ఆకట్టుకొనే విధంగా నటించింది. బెనర్జీ, ఇతర
పాత్రలు కథలో భాగంగా కనిపించాయి.
టెక్నికల్ అంశాలు
తిప్పరా మీసంలో టెక్నికల్ అంశాలు పైచేయి సాధించాయి. సురేష్ బొబ్బలి సంగీతం
బాగుంది. రీరికార్డింగ్ ఆకట్టుకొనేలా ఉండటమే కాకుండా కొన్ని సన్నివేశాలకు
బలంగా మారింది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ ఫర్వాలేదు. సిద్ సినిమాటోగ్రఫి
బాగుంది. నైట్, రెయిన్ ఎఫెక్ట్ సీన్ల చిత్రీకరణ బాగుంది. నిర్మాత రిజ్వాన్
ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.
ఫైనల్‌గా
తిప్పర మీసం తల్లి, కొడుకుల అనుబంధం, అపార్ధాలు మధ్య సాగే సాదాసీదా చిత్రం.
కాకపోతే సమకాలీన యువతలోని పోకడలను తెలియజెప్పుతూ సాఫ్ట్ నేచర్ ఇమేజ్ ఉన్న
శ్రీవిష్ణు మాస్‌గా చూపించడానికి చేసిన ఓ రకమైన ప్రయోగమనే చెప్పవచ్చు.
అన్ని అంశాలు పుష్కలంగా ఉన్న సగం వండిన వంటకంలా అనిపిస్తుంది. దాంతో ఈ
సినిమా యావరేజ్ స్థాయిలోనే నిలిచింది. యూత్ కనెక్ట్ అయ్యే అవకాశాలు
ఉన్నాయి. కనీసం అర్బన్ ఆడియెన్స్ చేరువైతే మంచి ఫలితాన్ని అందుకొనే అవకాశం
ఉంది.

Comments
Post a Comment