Skip to main content

Raja vaaru rani gaaru







Story: Raja (Kiran Abbavaram) is in love with Rani (Rahasya Gorak) but finds it hard to express his love due to fear of rejection. His two buddies step in to ease out the hurdles for their friend and come up with quirky plans to help him express his feelings.

Review: Raja Vaaru Rani Gaaru is a feel-good love story that all 90s kids will find easy to relate to. Set in the picturesque locales of Godavari, the teen love story will definitely be a nostalgic trip for many. While the story narrated by Ravi Kiran Kola offers nothing new, the way it unfolds is beautiful.

Chowdary (Rajkumar Kasireddy) and Naidu (Yazurved Gurram), dressed up like Batman and Joker, begin narrating their friend Raja’s love story to an unknown person abducted by them. Raja (Kiran Abbavaram) and Naidu run from their exam hall to prep the former’s proposal to Rani (Rahasya Gorak). With multiple attempts at proposal failing, the day comes when Rani moves away from their village for higher studies. The trio now must find out where she moved to, so Raja can express his love for her.

RVRG is the kind of film where you never really know what’s to follow, even if can predict how it’s all going to end. More than Raja and Rani’s love story, it is Chowdary and Naidu’s narration that steals the show. After a point in the film, one even begins feeling like they almost overshadow the plot at hand with their comedy and acting. Rajkumar and Yazurved just pour life into their roles.

With innocence and sweet heartedness that form human relationships, along with social stigmas surrounding caste, the film depicts a perfect love story set in a village. While it’s a well-made film, what works best are the dialogues that are natural. The second half of the film stretches a tad bit too long, with scenes getting repetitive, making for a tiresome watch. However, it does pick up pace towards the end. Vidyasagar Chinta and Amardeep Guttula’s camera-work is beautiful and Jay Krish’s music adds momentum to the cute love story. Viplav Nyshadam’s edit work is also near perfect.

Go watch this one this weekend if you’re looking for a feel-good love story that’ll leave you with a happy smile on your face.


తెలుగు సినీ తెరపై ఎన్నో ప్రేమకథలో వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి.. వస్తాయి కూడా. ప్రేమ అనేది దాదాపు అన్ని కథల్లో అంతర్లీనంగానైనా ఉంటుంది. ప్రేమకథలను ఎన్ని స్లార్లు అందంగా, అందరూ మెచ్చే విధంగా, కొత్తగా చూపిస్తే.. ప్రేక్షకులు ఎప్పుడూ తిరస్కరించరని ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఈ క్రమంలో టాలీవుడ్‌ తెరపైకి వచ్చిన మరో అచ్చమైన పల్లెటూరి స్వచ్చమైన ప్రేమకథ 'రాజావారు రాణిగారు'. ఈ సినిమా ఆడియెన్స్‌ను ఏమేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

కథ శ్రీరామపురం అనే గ్రామంలో రాజా (కిరణ్ అబ్బవరం), రాణి (రహస్య గోరక్)ని బాల్య స్నేహితులు. చిన్నతనం నుంచే రాణిపై రాజా ఇష్టాన్ని పెంచుకొంటాడు. అయితే ఆ తన మనసులోని విషయాన్ని మాత్రం చెప్పలేకపోయి మౌన ప్రేమికుడిగా మారిపోతాడు. ఓ క్రమంలో తన ప్రేమ విషయాన్ని రాణికి చెప్పడానికి అతని స్నేహితులు చౌదరి (రాజ్‌కుమార్ కసిరెడ్డి), నాయుడు (యజుర్వేద్ గుర్రం) సహాయం తీసుకుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మనసులోని మాటను మాత్రం చెప్పలేకపోతాడు. ఉన్నత చదువుల కోసం ఊరు విడిచి వెళ్లిన రాణి.. మూడున్నరేళ్లైనా తిరిగి రాదు. అయితే ఆమెను మళ్లీ ఊరికి రప్పించడానికి హీరో చేసిన ప్రయత్నాలు, వచ్చాక తన మనసులోని మాట చెప్తాడా? లేదా అన్నదే కథ.

కథలోని ట్విస్ట్‌లు ఉన్నత చదువుల కోసం ఊరిని విడిచి వెళ్లిన రాణిని తిరిగి రప్పించడానికి రాజా స్నేహితులు చేసిన ప్రయత్నాలేంటి? మూడున్నరేళ్ల తరువాత ఊరికి వచ్చిన రాణితో తన మనసులోని మాట చెప్పాడా? మధ్యలో వచ్చిన రాణి బావ కథేంటి? రాణితో పెళ్లికి ఒప్పుకుని మధ్యలోనే ఆమె బావ ఎందుకు పారిపోయాడు? చివరకు రాజా ప్రేమ కథ ఎలా ముగిసింది? అనే అంశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి.
ఫస్టాఫ్ అనాలిసిస్.. శ్రీరామపురం.. ఆ ఊరి అందాలను చూపించడం, రాజా-రాణిల ప్రేమకథను వారి స్నేహితులతో చెప్పించడం లాంటి సీన్స్‌తో మొదలు పెట్టి మెల్లిగా కథలో లీనమయ్యేట్టు చేయడం బాగుంటుంది. రాజా స్నేహితులైన చౌదరి, నాయుడు చేసే కామెడీ అందర్నీ నవ్విస్తుంది. రాణికి తన మనసులో మాట చెప్పేందుకు ప్రయత్నించడం, ప్రతీసారి విఫలం కావడం, మళ్లీ ప్రయత్నించడం లాంటి సీన్లతో లాక్కొని రావడం ఫర్వాలేదనిపిస్తుంది. ఉన్నత చదువుల కోసం పట్టణానికి వెళ్లిన రాణిని కలవడం కోసం రాజా పడే ఇబ్బందులు, అతని స్నేహితులు చేసే ప్రయత్నాలు నవ్వును తెప్పిస్తాయి. రాణి తండ్రి చెప్పే సమాధానాలు థియేటర్లలో హాస్యాన్ని పండిస్తాయి. ఇక ఎంతకీ రాణి ఆచూకి తెలియక పోవడంతో.. తిరిగి ఊరికి రప్పించేందుకు రాజా స్నేహితులు ఓ ప్లాన్ వేయడం.. దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం, రాణి ఊరికి రావడం లాంటి సీన్లతో ప్రథమార్థం బాగానే ఆకట్టుకుంటుంది.
సెకండాఫ్ అనాలిసిస్.. మూడున్నరేళ్ల తరువాత తిరిగి వచ్చిన రాణిని అలా చూస్తుండిపోతాడే తప్పా.. మనసులోని మాట చెప్పలేకపోవడం, మళ్లీ అదే కథ మొదలవ్వడంతో ప్రేక్షకుడికి సహన పరీక్ష మొదలవుతున్నట్లు అనిపిస్తుంది. ఎంతసేపు అదే పాయింట్ చుట్టూ తిప్పడంతో కథ ముందుకు సాగుతున్నట్లు అనిపించదు. రాణి బావ ఎంటరయ్యాక కాస్త బాగానే అనిపింస్తుంది. అప్పుడైనా రాజు తన ప్రేమను చెబుతాడా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తారు. రాణికి పెళ్లి ఇష్టం లేదని, ఆమె బావను సైడ్ చేసేయాలని స్నేహితులకు చెప్పడం, వారు అతడ్ని ఓ చోట బంధించడం, అతడికి ఈ రాజు ప్రేమకథను వివరించడం చివరకు బెదిరించడంతో పారిపోవడంతో పెళ్లి సమస్య తీరుతుంది. చివరకు మళ్లీ తన చదువుల కోసం రాణి బయల్దేరడం, చివరకు అక్కడే ప్రేమకథకు శుభం కార్డం పడటంతో ముగుస్తుంది. సెకండాఫ్ ఇంకాస్త ఆసక్తికరంగా మలిచితే సినిమా బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది.
 
నటీనటుల పర్ఫామెన్స్.. నటీనటుల పర్ఫామెన్స్.. ఈ చిత్రంలో నటించిన వారంతా దాదాపు కొత్తవారే. రాజు పాత్రలో కిరణ్, రాణి క్యారెక్టర్‌లో రహస్య గోరక్, చౌదరిగా రాజ్ కుమర్, నాయుడుగా యజుర్వేద్ గుర్రం ఇలా అందరూ ఎంతో చక్కగా నటించారు. రాజా, రాణి పాత్రలు ఒకెత్తు అయితే.. నాయుడు, చౌదరి పాత్రలు మరో ఎత్తు. చౌదరిగా నటించిన రాజ్ కుమార్ రూపంలో టాలీవుడ్‌కు మరో చక్కటి కమెడియన్ దొరికాడన్న ఫీలింగ్ కలుగుతుంది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన నటీనటులైనా, అంతగా పరిచయం లేని, స్టార్ స్టేటస్ లేని క్యాస్టింగ్ అయినా.. ఎక్కడా కూడా విసిగించకుండా ఆద్యంతం ఎంటర్‌టైన్ చేయడంలో చిత్రయూనిట్ సక్సెస్ అయింది. ఈ చిత్రంలోని ప్రతీ ఒక్క పాత్ర బాగానే ఆకట్టుకుంది.

దర్శకుడి పనితీరు.. ఇప్పటి కాలంలో నడిచే ప్రేమ కథల కన్నా.. ఓ పదేళ్లు, ఇరవైయేళ్ల క్రితం జరిగిన వాటిని తెరపై చూపిస్తే అందంగా ఉంటుందని, అందరూ ఆకర్షితులవుతారనే పాయింట్‌ను తీసుకోవడమే దర్శకుడి మొదటి సక్సెస్. నాటి కాలంతో టెక్నాలజీ అంతగా లేకపోవడం, ఒకరినొకరితో మాట్లాడుకోవడం లాంటివి కుదిరేవి కావు.. ప్రేమ లేఖలు రాసే కాలం అసలే కాదు.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్లతో నేటి తరానికి ఓ చక్కటి ఫీల్ గుడ్ మూవీని అందించేందుకు దర్శకుడు మంచి ప్రయత్నం చేశాడు. అయితే తన మనసులోని ప్రేమను చెప్పడం అనే ఈ పాయింట్ చుట్టే సినిమాను తిప్పడమే ప్రేక్షకుడికి కాస్త నిరాశకు గురి చేయవచ్చు. సినిమా ప్రారంభమై ఎంతసేపు గడుస్తున్నా.. ఆ ఒక్క అంశం చుట్టే తిరగడం, దాంతో సీన్లన్నీ రిపీట్ అవుతున్నట్లు కనిపించడం మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఓ చక్కటి ప్రేమ కథను చూశామన్న ఫీలింగ్‌ను కల్పించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.
సాంకేతిక నిపుణుల పనితీరు.. నువ్వంటే ఇష్టమని చెప్పడం పెద్ద కష్టమేమీ కాదురా.. నువ్వంటే ఇష్టంలేదని వినడానికి మాత్రం చాలా ధైర్యం కావాలి.., ప్రేమను చెప్పినవారివి ఎన్నో కథలున్నాయి.. చెప్పనోడి కథ వీడిది అంటూ చెప్పే డైలాగ్‌లు ప్రేమ లోతుల్ని, అందులోని భావాలను చాటిచెప్పేలా ఉన్నాయి. సంగీతం, నేపథ్య సంగీతం అన్నీ కూడా కథకు తగ్గట్టు ఉన్నాయి. పల్లెటూరి అందాలనే కాదు, నటీనటులను అందంగానూ చూపించారు సినిమాటోగ్రఫర్స్. సెకండాఫ్‌ను మరింత ఆసక్తికరంగా కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు, ఆర్ట్ విభాగం అన్ని సినిమా స్థాయికి తగ్గట్టున్నాయి.
ఫైనల్‌గా.. రాజా వారు రాణి గారికి తన ప్రేమ విషయాన్ని చెప్పడం కోసం పడే పాట్లు.. మిమ్మల్ని నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. రొటీన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చెప్పలేము కానీ, ఓ మంచి ఫీల్ గుడ్ మూవీని ఇష్టపడే వారిని మాత్రం కచ్చితంగా మెప్పిస్తుంది.
బలం, బలహీనతలు ప్లస్ పాయింట్స్ నటీనటులు కథ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ద్వితీయార్థం మెల్లిగా సాగే కథనం
 

Comments

Popular posts from this blog

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...