Skip to main content

Palasa 1978







Palasa 1978 Story: Set in Palasa, a town in Srikakulam district of Andhra Pradesh, the film tells the story of caste oppression and rifts caused between the landlords who work hard to hold on to their power and those who oppose them. When Mohan Rao (Rakshit) chooses the path of violence to oppose it, what unfolds is something that needs to be watched.

Palasa 1978 Review: Drawing inspiration out of true incidents and presenting them on-screen, by striking a balance between ideology and intensity, is a true test to filmmakers. And with Palasa, Karuna Kumar has successfully excelled in it. Staying true to the story he aims to tell, the debutant has delivered a wonderful crime drama that runs on the theme of caste oppression.

Mohan Rao (Rakshit) has killed Ganapa Vasu during a festival procession and has immediately gone into hiding. Dandasi (Laxman) begins narrating the story of Mohan Rao and his brother Ranga Rao (Thiruveer), two happy-go-lucky brothers from an artistic Dalit family that sings and dances in their free time and works as labourers otherwise in a cashew nut industry. Mohan Rao believes in fighting oppression with brawn while Ranga Rao believes in making those oppressing accountable. With the story set in 1978, the film shows how they face the wrath of caste discrimination, losing loved ones in the scuffle of regional politics and family factions.

Palasa is not your usual run-of-the-mill crime drama; it’s an offbeat film with a well-written script, dialogues (plus the way they’re delivered) and screenplay. The way the social structure of the era shown is executed is laudable. The detailing of the caste-oriented roles and people’s subversion to them is well-stitched. Though a fictional story, Kumar never takes the liberty to take the story into a commercial zone or put in scenes for the sake of entertainment. However, the film is not without its drawbacks as the slight slow-down in the second half of it might be considered as one.

Thiruveer, who got attention as the antagonist in George Reddy steals the show once again. Raghu Kunche as Chinna Dora Guru Murthy and Janardhan as Pedda Dora Linga Murthy shine in their roles, and their dialogue delivery deserves special mention. Rakshit, who’s the epicentre of the story performs well, but compared to rest of the cast, fades in comparison. Laxman, Nakshatra, Madhavi, Jagadeesh Prathap Bandari and Vijay excelled in their roles, going all out. Apart from his brilliant role as the antagonist, Raghu Kunche delivers some stupendous folk numbers and a decent background score. Vincent Arul’s cinematography is satisfactory.

Highlighting the casteist nature of the state and mainstream politics, Palasa has a reference to many atrocities committed on Dalits across the country. Be it honour killings or the Karamchedu Massacre or Rohit Vemula’s suicide, the film talks about them all through Mohan Rao and Sebastian’s characters. Palasa doesn’t end up in the general utopian idea of transformation of the invasion of bureaucracy by Dalits, but definitely shows the path for a much-needed struggle for survival and to achieve equality.



స్వతంత్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినా కుల వివక్ష దారుణమైన పరిస్థితులను సృష్టిస్తున్నది. అగ్రవర్ణాల, దళితుల మధ్య దాడులు సమాజంపై మాయని మచ్చలు వేస్తున్నాయి. చుండూరు గానీ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, దేశంలోని పలు ప్రాంతాల్లో కులాల కుంపట్లు రాజుకుంటూనే ఉన్నాయి. ఎన్నో దారుణాలకు సాక్ష్యంగా నిలిచిన సమాజం ఆ నెత్తుటి మరకలను తుడిచిపెట్టలేకపోతున్నది. ఆ పరిస్థితులే ప్రాంతీయ అసమానతలను పెంచుతూ వర్గాల వారీగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.


అలాంటి సంఘటనల ఆధారంగా ఎన్నో అభ్యుదయ చిత్రాలు వెండితెర మీద ఆవిషృతమయ్యాయి. తాజాగా ఆ కోవలో కుల వివక్షపై సంధించిన సినీ అస్త్రం పలాస 1978. రచయిత కరుణ కుమార్ తెరకెక్కించిన చిత్రం ఎలాంటి అనుభూతులను, ఆలోచనలను రేకెత్తించింది? ఎలాంటి అనుభూతులను పంచిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే అసలు పలాస 1978 గురించి సమీక్షించుకోవాల్సిందే.

పలాస 1978 కథ 80 దశకంలో పలాసలో అగ్రవర్ణాల కుటుంబాలకు, నిమ్న వర్గాల మధ్య అసమానతలు తీవ్రంగా నెలకొని ఉంటాయి. నీళ్లు తాకితే మైల పడిపోతుందని చిన్న కులాల వారిపై దారుణంగా దాడులకు పాల్పడుతుంటారు. అలాంటి క్రమంలో పాటలు పాడుకుంటూ జీవనం సాగించే గ్రామ యువకులు మోహన్ రావు (రక్షిత్), రంగారావు (తిరువీర్) గొంతు లెవనెత్తుతారు. దాంతో అగ్రవర్ణాలకు, వెలివేయబడిన కులాలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. గ్రామంలో ఫ్యాక్షన్ రెచ్చగొట్టే పెద్ద షావుకారు, చిన షావుకారు గురుమూర్తి (రఘు కుంచె) అన్యాయాలను ఎదురించడం మొదలుపెడుతారు.

పలాస 1978 కథలో ట్విస్టులు కళాకారులైన మోహన్ రావు, రంగారావు రౌడీలుగా ఎందుకు మారాల్సి వచ్చింది? పెద్ద షావుకారుకు, చిన్న షావుకారు మధ్య విభేదాలు ఏ మేరకు ఊరిలో చిచ్చుపెట్టాయి? పెద్ద షావుకారును చంపడానికి ఎలాంటి సంఘటనలు కారణమయ్యాయి? చిన్న షావుకారును ఇద్దరు యువకులు ఎలా ఎదురించారు? ఫ్యాక్షన్‌ను అంతం చేయడానికి ప్రయత్నించిన పోలీస్ ఆఫీసర్ సెబాస్టియన్ (విజయ్ రామ్) పరిస్థితి చివరు ఏమైంది? అగ్రకులాలను ఎదురించే క్రమంలో మోహన్ రావు, రంగారావు ఎలాంటి త్యాగాలకు పాల్పడాల్సి వచ్చిందనే పలు ప్రశ్నలకు సమాధానమే పలాస 1978.

ఫస్టాఫ్ అనాలిసిస్ గ్రామ జాతర జరుగుతుండగా చనిపోయాడనుకొన్న మోహన్ రావు తన ప్రత్యర్థిని చంపడంతో కథ సీరియస్‌ నోట్‌లో మొదలవుతుంది. 80 నాటి పరిస్థితులు, వాతావరణం తెరపై కొత్తగా కనిపించడం, మొదటి నుంచే తెర మీద సన్నివేశాలు పేర్చుకొంటూ పోయిన వైనం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతుంది. మోహన్ రావు గురించి రిటైర్డు కానిస్టేబుల్ చెప్పడంతో కథ 80 దశకంలోకి వెళ్తుంది. గ్రామ కక్షలు, రాజకీయాలు, ప్రేమ, భావోద్వేగాలను జోడించడంతో సీన్లు తొలిభాగంలో పరుగులు పెడుతుంటాయి. కళను నమ్ముకొన్న ఇద్దరు యువకులు కత్తిపట్టి రౌడీయిజం మారే క్రమం ఆసక్తిగా కనిపిస్తుంది. నటీనటుల అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌, తూటాల్ల పేలే డైలాగ్స్‌తో పవర్ ప్యాక్డ్, ఎమోషనల్ సీన్‌తో తొలి భాగం ముగుస్తుంది.

సెకండాఫ్ ఎనాలిసిస్ ఇక సెకండాఫ్‌లో ఓ మర్డర్ సీన్‌తో సినిమా మరో లెవెల్‌‌కు వెళ్లినట్టు కనిపిస్తుంటుంది. కానీ సెకండాఫ్ తర్వాత సినిమా రొటీన్ ఫార్మాట్‌లోకి మారినట్టు కనిపిస్తుంది. కాకపోతే ట్విస్టులు, యాక్షన్ సీన్లు, భావోద్వేగమైన సన్నివేశాలు, డైలాగ్స్ సెకండాఫ్‌‌ను డ్రాప్ కాకుండా కాపాడాయని చెప్పవచ్చు. చివర్లో సెబాస్టియన్ పాత్రను హైలెట్ చేస్తూ కథలో సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నాలు జరిగాయి. గ్రామ కూడలిలో ఒక చేతిలో పుస్తకం పట్టుకొని.. మరో చేతిని మనం ఎక్కడికి పోవాలో చూపించే మహానుభావుడు స్ఫూర్తితో అంటూ సెబాస్టియన్ చేత చెప్పించిన మాటలు ఆలోచింపజేస్తాయి. అలాగే వినాయకుడి మెడను అతికించే దేవుడు ఉన్నప్పుడు? ఏకలవ్యుడు బ్రొటన వేలిని అతికించే దేవుడిని ఎందుకు సృష్టించలేదు అంటూ దర్శకుడు సంధించిన విమర్శనాస్త్రం సినిమాను పరిపూర్ణం చేసేందుకు ఉపయోగపడిందని చెప్పవచ్చు. చివర్లో మోహన్ రావు పాత్ర ద్వారా ఇచ్చిన ట్విస్టు సినిమా ప్రతీ ప్రేక్షకుడిని కదిలించేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

దర్శకుడి ప్రతిభ తన కళ్లముందు ఉత్తరాంధ్రలో జరిగిన వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని దర్శకుడు కరుణ కుమార్ తనదైన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసిన తీరు అభినందనీయం. ప్రతీ ఫ్రేమ్‌లో ప్రేక్షకుడిని ఆలోచింపజేసే విధంగానూ, ఆనందం నింపే విధంగా కమర్షియల్, ఆర్ట్స్ ఫార్మాట్లను తొలి భాగంలో మేలవించిన తీరు ప్రశంసనీయం. అయితే సెకండాఫ్‌కు వచ్చే సరికి ఆ మ్యాజిక్ కొంత నీరుగారినట్టు అనిపించినా.. పతాక సన్నివేశాల్లో భావోద్వేగ, నాటకీయ సన్నివేశాలతో ఆ లోటును భర్తీ చేశాడని చెప్పవచ్చు. పలాస 1978 సినిమా చూస్తే కరుణ కుమార్ తొలి చిత్ర దర్శకుడనే ఫీలింగ్ ఎక్కడా కలుగదు. ప్రతీ సీన్‌ను తెరకెక్కించిన విధానం కళలపై ఉన్న మక్కువ కనిపిస్తుంది. సమాజంపై దర్శకుడికి ఉన్న అసహనం, అసంతృప్తి తెరమీద స్పష్టంగా కనపడుతుంది. దర్శకుడిగా ఎంత సక్సెస్ అయ్యాడో.. రచయితగా కూడా అంతే రేంజ్‌లో మెప్పించాడు.

రక్షిత్, తిరువీర్, నక్షత్ర గురించి ఇక పలాస 1978 మూవీకి వెన్నెముకగా నిలిచింది మోహన్ రావు పాత్ర. ఈ పాత్రలో రక్షిత్ పరకాయ ప్రవేశం చేశాడా? అనే ఫీలింగ్ కలుగుతుంది. పలు షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను మంచి నీళ్లు తాగినంత తేలికగా చేసేశాడు. హావభావాలు పలికించంలోను, డైలాగ్స్ చెప్పడంలోను, ప్రేమ సీన్లను పండించడంలోను ఆల్ రౌండ్ ప్రతిభను చాటుకొన్నాడు. ఆ తర్వాత రంగారావు పాత్రను తిరువీర్ కూడా అద్బుతంగా పోషించాడు. ఆవేశం కలిగిన యువకుడిగా రక్షిత్‌తో పోటాపోటీగా నటించి మెప్పించాడు. నక్షత్ర పాత్ర కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది, ఆమె అందంతోపాటు, అభినయంతో ఆకట్టుకొన్నారు.

టెక్నికల్ విభాగం పనితీరు టెక్నికల్ విభాగం పనితీరు సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. పలాస 1978ను అద్భుతమైన చిత్రంగా నిలబెట్టింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. కొన్ని సీన్లను రీరికార్డింగ్ మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. కథలో ఉండే టెంపోను, ఎమోషన్స్‌ను నిలకడగా ఉండేలా మ్యూజిక్ దోహదపడింది. ఈ సినిమాకు మరో బలం డైలాగ్స్. దర్శకుడు కరుణ కుమార్ రాసుకొన్న మాటలు ఆలోచింపజేస్తాయి. హాస్యాన్ని పండించాయి. హృదయంలో ఓ ఆర్ధతను మిగులుస్తాయి. 80 నాటి పరిస్థితులను తెర మీద కనిపించేలా చేసిన అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫి మరో స్పెషల్ ఎట్రాక్షన్. లైటింగ్ చాలా ఫర్‌ఫెక్ట్‌గా ఉండటంతో సన్నివేశాల మూడ్ చాలా ఎలివేట్ అయింది. ఎడిటింగ్‌తో ప్రతీ విభాగం చక్కగా పనిచేసిందనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే కథ మొత్తం ఒకే ఫార్మాట్‌లో ఉండటం వల్ల సినిమా నిడివి ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన పలాస 1978 చిత్రంలో ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. ఇటీవల కాలంలో రంగస్థలం తర్వాత ఇంత రిచ్‌గా తెరకెక్కించిన దాఖలాలు టాలీవుడ్‌లో కనిపించవు. కథ, నటీనటులు ఎంపిక సినిమాపై నిర్మాతలకు ఉన్న అభిరుచిని తెలియజేస్తుంది.

ఫైనల్‌గా గ్రామ రాజకీయాలు, సమాజంలోని కుల వివక్ష, అగ్రవర్ణాల దాడులు తదితర అంశాలను ఆధారంగా చేసుకొని సంధించిన సినీ విమర్శనాస్త్రం పలాస 1978. సినిమాకు సాంకేతిక విభాగాల పనితీరు, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ ప్రధాన బలం. ఆలోచింప జేసే డైలాగ్స్, కథనం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సమాజిక అంశాలు అద్దిన ఆర్ట్ సినిమాగా అనిపించినా.. కమర్షియల్ పుష్కలంగానే ఉన్నాయి. బీ, సీ సెంటర్లతోపాటు మల్టీప్లెక్స్ ప్రేక్షకుల ఆదరణకు లభిస్తే కమర్షియల్‌గా మరో రేంజ్‌కు వెళ్లడం ఖాయం.

బలం, బలహీనతలు ప్లస్ పాయింట్స్ కథ, కథనాలు నటీనటుల ఫెర్ఫార్మెన్స్ ఫస్టాఫ్ సినిమాటోగ్రఫి, మ్యూజిక్ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ రోటీన్ కథ సెకండాఫ్‌లో కొంత సినిమా నిడివి
తెర ముందు, తెర వెనుక నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, విజయ్ రామ్, తిరువీర్, లక్ష్మణ్ మీసాల, ప్రవీణ్ ఎండమూరి, జగదీష్ ప్రతాప్ బండారి, మిర్చి మాధవి, షణ్ముఖ్ తదితరులు పాటలు: భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల,

Comments

Popular posts from this blog

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...