Story: Prema Pipasi is the story of a guy (GPS) who cheats on and sleeps with multiple women to find his ‘one true love’. What happens when he meets his old girlfriend (Kapilakshi Malhotra)?
Review: Love stories have evolved a lot over the decades, also giving life to many stars who were once underdogs. However, the current crop of small films makes one wonder where the love is in the story. It is especially traumatising to see the director of this particular tale treat women the way he does and glorify an alcoholic man who stalks, gropes, abuses and forces women.
Our ‘hero’ in the tale even goes a step ahead and begins threatening women to sleep with him. Literally that’s all the first half of the film holds – a man only referred to as ‘bava’ exploiting multiple women. And just so you don’t feel he’s too disgusting, the women are all shown as gold diggers, as if that makes it better. What’s even worse is how you’re expected to believe his cheap techniques and cringe-worthy flirting make women cave.
Things take a turn for worse when he meets a girl he once loved and falls in love with her again, believing she is who he has been looking for all along. Consent be damned, because she sure doesn’t seem interested. His idea of making her fall for him is to sit in front of her home and drink liquor till she says yes. And for some inexplicable reason, a multi-millionaire (Suman) decides to help him in this endeavour. By the time the cliché ending rolls around, you won misogyny has won the day.
GPS is as confusing and confounding as his name as an actor. He does not perform well, even if all he’s required to do is grope women in the name of love. The multiple women deliver pathetic performances too and there’s nothing to write home about when it comes to the technicalities.
Prema Pipasi is a two-and-a-half-hours long rant on women allegedly doing what the protagonist of this tale does in the name of love. While it is unknown what urged the director to make this film, his characters sure need some police counselling and a lesson on consent.
వెండితెరపై ప్రేమ కథలు వచ్చాయి.. వస్తూనే ఉంటాయి. ఎన్ని ప్రేమ కథలు
వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ప్రతీ సినిమాలోనూ అంతర్లీనంగా
ప్రేమ కథ ఉంటూనే వస్తుంది. అయితే అలాంటి ప్రేమకథ చుట్టూనే తిరిగే
సినిమాలంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ అంచనాలు ఉంటాయి. మరో కొత్త ప్రేమకథతో
ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చింది ప్రేమ పిపాసి. మరి ఈ చిత్రం ఏ మేరకు
ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.
కథ
బావ (జీపీఎస్) కనిపించిన ప్రతీ అమ్మాయిని ట్రాప్‌లో పడేస్తాడు. ప్రేమ అంటూ
అసలు పని కానిచ్చేస్తాడు. అవతల ఉన్న అమ్మాయిలు కూడా బావను తెగ వాడేస్తూ
ఉంటారు. అయితే ఇలా జరుగుతూ ఉండగా.. బాలా (కపిలాక్షి మల్హోత్ర)ను చూసి
ప్రేమించడం మొదలు పెడతాడు.
కథలో ట్విస్ట్‌లు..
అప్పటి వరకు కనిపించిన అమ్మాయిను ప్రేమ అంటూ ట్రాప్ చేసి అసలు విషయం జరిగాక
వదిలేసే బావ.. బాలాను ఎందుకు ప్రేమిస్తాడు? బాలా ఎంతగా చీ కొట్టినా తన
వెంటే ఎందుకు పడతాడు? బావ-బాలాకు ఉన్న గతం ఏంటి? అమ్మాయిలను బావ ఎందుకు
ట్రాప్ చేస్తుంటాడు? ఈ కథలో సుమన్ పాత్ర ఏంటి? చివరకు ఏమైంది? లాంటి
ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ప్రేమ పిపాసి.
సెకండాఫ్ అనాలిసిస్..
తన కూతురుని ట్రాప్ చేస్తున్నాడని తెలిసిన సుమన్.. బావను చితక్కొట్టించడం, ఆ
సమయంలో బాలాను కనబడటంతో కథలో మలుపు తిరిగిన ఫీలింగ్ వస్తుంది. అయితే
ప్రథమార్థంలో ఏదో కొత్తగా ఉంటుందని ఎదురు చూసే ప్రేక్షకుడి మాత్రం నిరాశే
కలుగుతుంది. బాలా ఇంటి ముందే ధర్నాకు దిగడం, అక్కడే కథంతా గిరగిర తిరినట్టు
అనిపిస్తుంది.అయితే ఈ సమయంలో వచ్చే జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు చేసే కామెడీ
ఆకట్టుకుంది. ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా చూసుకోవడంతో ఆ సీన్స్ అన్నీ
చకచకా వెళ్లిపోతాయి. బాలా-బావకు ఉన్న గతం, ఫ్లాష్ బ్యాక్‌లో బావ స్నేహితుడు
కార్తీక్‌ను ప్రీతి మోసం చేస్తుంది. దీంతో అతను ఆత్మహత్య చేసుకోవడంతో
అమ్మాయిలను ట్రాప్ చేసే వాడిగా బావ మారిపోతాడు. ప్రీ క్లైమాక్స్,
క్లైమాక్స్‌లో అంత ఆసక్తికరమైన అంశాలు లేకపోవడం కాస్త మైనస్‌గా మారే అవకాశం
ఉంది. టోటల్‌గా ద్వితీయార్థం ప్రేక్షకులను మెప్పించిందే చెప్పవచ్చు.
దర్శకుడి పనితీరు..
ప్రేమ పిపాసి సినిమాకు తీసుకున్న లైన్ యూత్‌ను ఆకట్టుకునేది కావడం ప్లస్
పాయింట్. ఈ కాలంలో ప్రేమ ఎలా ఉంది? అమ్మాయిలు-అబ్బాయిలు ఎందుకు
ప్రేమించుకుంటున్నారు? దేని కోసం ప్రేమించుకుంటున్నారు? అనే అంశాలతో
అల్లుకున్న కథ కావడంతో బాగానే అనిపిస్తుంది. అయితే తెరకెక్కించిన
విధానంలోనూ కాస్త తడబడినట్టు కనిపిస్తుంది. సినిమాలోని సీన్స్ పదే పదే
రిపీట్ అయినట్టు, కథ ముందుకు సాగినట్టు అనిపించకపోవడమే మైనస్. అక్కడక్కడా
డైలాగ్స్ బాగానే పేలాయి. మొత్తంగా యూత్‌ను టార్గెట్ చేసిన దర్శకుడు ఆ
విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.
ఫైనల్‌గా..
ప్రేమ పిపాసి అనే సినిమా చూస్తున్నంత సేపు.. ఈ సినిమాకు ఈ టైటిల్ కరెక్ట్
కాదేమోనన్న అనుమానం ప్రేక్షకులకు కలగవచ్చు. అయితే బీ, సీ సెంటర్లలో ఈ
చిత్రం వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తోంది. మరి కమర్షియల్‌గా ఏ మాత్రం విజయం
సాధిస్తుందో వేచి చూడాలి
బలాలు, బలహీనతలు..
ప్లస్ పాయింట్స్
నటీనటులు
యూత్‌ను ఆకట్టుకునే సీన్స్
మైనస్ పాయింట్స్
ఆసక్తికరంగా సాగని కథనం
క్లైమాక్స్
నటీనటులు
నటీనటులు : కపిలాక్షి మల్హోత్ర, సోనాక్షి, సుమన్ తదితరులు
దర్శకత్వం : మురళీ రామస్వామి
నిర్మాత : పీఎస్ రామకృష్ణ
బ్యానర్ : ఎస్‌ఎస్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్, రాహుల్ భాయ్ మీడియా, దుర్గ శ్రీ ఫిల్మ్
మ్యూజిక్ : ఆర్ఎస్
సినిమాటోగ్రఫి : తిరుమల్ రోడ్రిగుజ్
ఎడిటింగ్ : ఎస్‌జే శివ కిరణ్
Comments
Post a Comment