Skip to main content

PRATIROJU PANDAAGE







Story: Raghu Ramayya (Satyaraj) is a man with limited time to live. His children, who all live elsewhere, struggle to schedule their time around his death. But what happens when his grandson Sai (Sai Dharam Tej) takes it upon himself to give his grandfather the farewell he deserves?

Review: With Prati Roju Pandaage, Maruthi tries hard to deliver a tale that shows how parents feel when they’re nearing the end of days and their children have no time for them. He also tries to show the intricacies of the bond a father shares with his children. But it’s clear from the get-go that this is Raghu Ramayya’s (Satyaraj) story above all. And unfortunately for Sai Dharam Tej, he gets massively overshadowed by the likes of Rao Ramesh and Murali Sharma.

When Raghu Ramayya is nearing the end of days, his three sons and one daughter manage to set aside two weeks for him. His grandson Sai (Sai Dharam Tej) however decides to help him celebrate life before his impending death and maybe even bring the whole family together, so his grandfather dies a happy man surrounded by loved ones. He’s so hell-bent on it that he even helps him meet his old flame, reconcile with his best friend and even gets ready to marry the girl of his choice.

Thrown into the mix are Rao Ramesh, as the eldest son who has a business deal he needs to close, Murli Sharma as the client he’s trying to woo, Ajay and Satyam Rajesh as Sync Brothers, whose only function in the tale is to appear on-screen and get beaten up by a buff Sai Dharam Tej in two random scenes, a trusty sidekick played by Suhas and most importantly, Aarna (Raashi Khanna), the TikTok queen who believes Sai is a fan who came to meet her in Rajahmundry all the way from the US.

Maruthi even manages to get the tone of the film right at first. Despite the cliché route the story takes, with absolutely no surprises, tears and false death proclamations galore, the director manages to make the first half work. It is replete with dark humour and the jokes somehow seem to land most of the time. Rao Ramesh delivers his lines with such ease, it’s hard not to laugh along. The film however suffers from the ‘second half syndrome’ where things go downhill and get so jarringly repetitive, it’s hard not to notice. There’s a long, overdrawn joke about each child of Ramayya describing to him how his funeral plans are being made, complete with live samples and tacky to begin with, it gets too much after a while. The fact that most of the actors in this film (including Sai Dharam Tej) have nothing much to do also begins to get clear.

Satyaraj, Rao Ramesh, Murli Sharma, Hari Teja and Raashi Khanna, even in the limited role, hit the ball out of the park. While Satyaraj does tend to get a little melodramatic at times, it’s hard not to feel for him and his character. Sai Dharam Tej, despite being set up as the hero in the first half, gets overshadowed as the film progresses. But he does manage to hold his own when the time comes. While cinematic liberties are constantly employed, when a person diagnosed with lung cancer begins cycling and playing cricket, you know it’s too much to handle. By the time the climax and Sai Dharam Tej’s soliloquy rolls around, you’re just waiting for what you know is to follow next, the happy ending. The cinematography by Jayakumar is apt and Thaman S' BGM works well for the film.

Don’t get us wrong because Prati Roju Pandaage has ample moments that’ll make you smile and relate to the characters, if not anything else. Go watch this one if family dramas that are relatable and leave you feeling good are your cup of tea.



తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే బంధాలు, బాంధవ్యాలు నేపథ్యంగా తెలుగు తెరపై చాలా సినిమాలే వచ్చాయి. ఇటీవల కాలంలో విదేశాల్లో స్థిరపడిన పిల్లలు, వారి తల్లిదండ్రులను విస్మరిస్తున్నారనే కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొన్నాయి. అలాంటి నేపథ్యంతో తండ్రి, కొడుకుల రిలేషన్స్‌తో వచ్చిన చిత్రం ప్రతి రోజు పండగే సినిమా. మారుతి దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్, అందాల భామ రాశీఖన్నా జంటగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఫలితాన్ని అందుకున్నదనే విషయాన్ని తెలుసుకొందాం..

ప్రతి రోజూ పండగే కథ పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడటంతో రాజమండ్రిలో రఘురామయ్య (సత్యరాజ్) తన శేష జీవితాన్ని గడుపుతుంటాడు. ఆ క్రమంలో ఆయన ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌కు లోనవుతాడు. ఇదిలా ఉండగా అమెరికాలో వ్యాపారవేత్త రఘురామయ్య కుమారుడు రమేష్ (రావు రమేష్)‌కు తన కుమారుడు సాయి (సాయిధరమ్ తేజ్) అంటే పంచప్రాణాలు. క్షణం కూడా సాయి లేకుండా ఉండలేరు. ఇలాంటి క్రమంలో తాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తండ్రిని వదిలేసి సాయి రాజమండ్రికి చేరుకొంటాడు.

ప్రతి రోజూ పండగే కథలో ట్విస్టులు నాలుగు వారాల్లో చనిపోయే తాత కోసం సాయి ఏం చేశాడు? డబ్బే సర్వస్వంగా భావించే రాఘు రామయ్య ముగ్గురు కొడుకులు, కూతురు తండ్రి ప్రాణాంతక వ్యాధి పట్ల ఎలా స్పందించారు? తమ బిజీ షెడ్యూల్‌లో మానవ సంబంధాలు మరిచిన కొడుకులు, కూతుళ్లు ఎలా ప్రవర్తించారు? తాత చివరి కోరికలను సాయి తీర్చాడా? జన్మనిచ్చిన తండ్రిని కూడా మరిచిన కొడుకులు, కూతుళ్లకు (తండ్రి, బాబాయ్‌లు, పిన్ని)కి సాయి ఏ విధంగా బుద్ది చెప్పారు? ఇలాంటి ఎమోషనల్ కథలో టిక్ టాక్ స్టార్ ఏంజెల్ ఆర్న (రాశీఖన్నా)తో సాయి రొమాంటిక్ లవ్ ట్రాక్ ఎలా ఉంది. సింక్ బ్రదర్ రాజేశ్, అజయ్ విలనిజం పండిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ప్రతి రోజూ పండగే సినిమా కథ.

ఫస్టాఫ్ ఎలా ఉందంటే అమెరికాలో సాయిధరమ్ తేజ్, రావు రమేష్ మధ్య రిలేషన్‌తో కథ మొదలు పెడతారు. వారి క్యారెక్టర్లను చకచకా ఎస్టాబ్లిష్ చేసుకొని నేరుగా కథలోకి వెళ్లిపోవడంతో ప్రతీ రోజు పండగే చిత్రం ఎమోషనల్‌గా మారుతుంది. రాజమండ్రిలో సత్యరాజ్ క్యాన్సర్‌కు గురికావడం.. దానికి కొడుకులు స్పందించిన తీరు కళ్లు చెమ్మగిల్లేలా చేస్తుంది. కమర్షియల్ విలువ కోసమే ఏమో సింక్ బ్రదర్స్‌గా సత్యం రాజేశ్, అజయ్‌ను తీసుకొచ్చి మాస్ ప్రేక్షకులకు సంత‌ృప్తి కలిగించేలా కథ ముందుకెళ్తుంటుంది. ఇక కామెడీ, ఎమోషనల్‌తోపాటు రాశీఖన్నాతో రొమాన్స్‌ను బ్యాలెన్స్ చేయడంతో ఫస్టాఫ్ ఫీల్‌గుడ్‌గా ముగుస్తుంది.

సెకండాఫ్‌ గురించి ఇక సెకండాఫ్‌లో సత్యరాజ్ చావు చుట్టే కథ తిరగడంతో ద్వితీయార్థంలో కొంత రొటీన్‌గా మారినట్టు కనిపిస్తుంది. అయితే డబ్బు, విదేశీ జీవన యావలో తండ్రి మరణం కోసం ఎదురుచూసే కొడుకు, కూతుళ్ల క్యారెక్టర్లను దర్శకుడు మారుతి బాగా డీల్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో సాయిధరమ్ చేత ఆడించిన డ్రామా మరింత ఎమోషనల్‌గా మారుతుంది. కొడుకులు, కూతుళ్లు మారే క్రమాన్ని హై ఎమోషనల్‌గా ఉండటంతో ప్రతి రోజు పండుగే భావోద్వేగంగా హృదయాన్ని టచ్ చేస్తుంది.

సాయిధరమ్ తేజ్ ఫెర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు కమర్షియల్ హీరోగా ముద్ర వేసుకొన్న సాయిధరమ్ తేజ్ ప్రతి రోజూ పండగేతో ఫ్యామిలీ హీరోగా మారిపోవడం ఖాయం. పాటలు, ఫైట్స్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు కనుక కీలక సన్నివేశాల్లో సాయి యాక్టింగ్ కంటతడి పెట్టించేలా ఉంటుంది. ఎమోషనల్‌ సీన్లలో సాయి ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొంటుంది. ఈ సినిమాలో కొత్త సాయిధరమ్ తేజ్‌ను చూడటానికి అవకాశం కలిగింది.

రాశీఖన్నా గ్లామర్‌గా ఇక హీరోయిన్‌గా రాశీఖన్నా మరింత నాజుక్కుగా, గ్లామర్‌గా కనిపించడమే కాకుండా ఫెర్ఫార్మెన్స్ పరంగా రాణించింది. టిక్ టాక్ స్టార్‌గా వినోదాన్ని పంచింది. తనకు లభించిన స్పేస్‌లో అన్ని రకాలుగా మెప్పించింది. సాయిధరమ్ తేజ్‌తో కెమిస్ట్రీని బ్రహ్మండంగా పండించింది. ఎమోషనల్ కథకు తన వంతుగా న్యాయం చేసింది.

సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ యాక్టింగ్ ఇక ప్రతీ రోజూ పండగే సినిమాను తమ పెర్ఫార్మెన్స్‌తో ఓ ఫెస్టివల్‌గా మార్చిన వారిలో సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. సాయిధరమ్ తేజ్‌కు తాత క్యారెక్టర్‌లో సత్యరాజ్ తండ్రిగా రావు రమేష్ తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. రావు రమేష్ మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ విశేషంగా ఆకట్టుకొంటాయి. పాత్రలో పరకాయ ప్రవేశం చేశారా అనే విధంగా రమేష్‌గా తెరపైన కనిపించడమే కాకుండా సమకాలీన సమాజంలో కొందరు వ్యక్తులకు నిదర్శనంగా కనిపించారు. ఇక ఇలాంటి తాత ఉంటే బాగుండనే విధంగా సత్యరాజ్ రాఘురామయ్యగా నటించాడు. మురళీశర్మ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించి కథకు ఫీల్‌గుడ్‌గా మారాడు. గయ్యాలి తరహా కోడలి పాత్రలో హరితేజ బాగా నటించింది.

దర్శకుడు మారుతి ప్రతిభ ఎమోషన్స్‌ను పట్టుకొని కథ నడిపించడంతోపాటు వినోదం ఏ మాత్రం తగ్గకుండా సినిమా డీల్‌ చేయడంలో దర్శకుడు మారుతి స్టయిల్ డిఫరెంట్‌గా ఉంటాయి. అటు కమర్షియల్ విలువులు, భావోద్వేగమైన అంశాలను బ్యాలెన్స్ చేస్తూ గతంలో సక్సెస్ అందుకోవడం తెలిసిందే. తాజా ప్రతి రోజు పండగే సినిమాలో క్యారెక్టర్లను డిజైన్ చేసిన తీరు ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుంది. ఇక వినోదంలో ఆయన స్టయిల్ యధావిధిగా కొనసాగుతూ ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లేలా చేస్తూ మరోవైపు నవ్వించడంలో కూడా సఫలమయ్యాడు. చక్కటి పచ్చదనం మధ్య సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులకు పండగలాంటి ఫీలింగ్ కలిగించాడు. రావు రమేష్ క్యారెక్టర్‌ను, అలాగే మురళీశర్మ, సత్యరాజ్ క్యారెక్టర్లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు.

మ్యూజిక్, సినిమాటోగ్రఫి ఇక సాంకేతిక అంశాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తమన్ మ్యూజిక్ గురించి. కథ, ఎమోషనల్ అంశాలకు సరిపోయే విధంగా సంగీతాన్ని అందించారు. కీలక సన్నివేశాలను రీరికార్డింగ్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. బావా పాట మంచి జోష్‌తో తెరపైన సాగింది. తకిట, తకిట, ప్రతి రోజు పండగే పాటలు ఆకట్టుకొనేలా ఉంటాయి. గోదావరి జిల్లా అందాలను సినిమాటోగ్రాఫర్ జయకుమార్ చక్కగా తెరకెక్కించారు. తెరను పచ్చదనంతో ఆహ్లాదకరంగా మార్చారు.

ఎడిటింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాను పరుగులు పెట్టించడంలో ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ప్రతిభ మరింత తోడైంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్ల నిడివి కొంత ఎక్కువే అనిపించినప్పటికీ.. కథ గమనానికి అడ్డుపడలేదనే చెప్పవచ్చు. సెకండాఫ్‌లో కొన్ని సీన్ల నిడివి తగ్గిస్తే కొంత రిలీఫ్‌గా ఉండే అవకాశం ఉంది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

ఫైనల్‌గా మానవ సంబంధాలు, కుటుంబ బంధాలు, అనుబంధాల నేపథ్యంగా తెరకెక్కిన చిత్రం ప్రతి రోజూ పండగే. ఎమోషనల్ అంశాలు, వినోదం, కమర్షియల్ అంశాలు సినిమాకు బలం. మారుతి దర్శకత్వ ప్రతిభ, సాయిధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్, సత్యరాజ్, రావు రమేష్‌, మురళీశర్మ యాక్టింగ్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల ఆదరణ లభిస్తే కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం.

బలం, బలహీనతలు కథ, కథనాలు భావోద్వేగ అంశాలు సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ యాక్టింగ్ సాయిధరమ్ తేజ్ ఫెర్ఫార్మెన్స్ రాశీఖన్నా గ్లామర్ సినిమాటోగ్రఫీ, సంగీతం ఫస్టాఫ్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్‌లో కొంత సాగదీసినట్టు అనిపించడం కొన్ని రొటీన్ కామెడీ సీన్లు

తెర ముందు, తెర వెనుక సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, హరితేజ, ప్రభ, నరేష్, విజయ్ కుమార్, మహేష్, సుహాస్, భరత్ రెడ్డి, సత్యం రాజేశ్, అజయ్ తదితరులు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మారుతి దాసరి



Comments

Popular posts from this blog

Kuthiraivaal

  Kuthiraivaal Movie Review:  Manoj Leonel Jahson and Shyam Sunder’s directorial debut Kuthiraivaal brims with colours and striking imagery. This is apparent as early as its first scene, where its protagonist Saravanan alias Freud squirms in his bed, suspecting a bad omen. As some light fills his aesthetic apartment wrapped with vintage wall colours, his discomfort finally makes sense—for he has woken up with a horse’s tail! The scene is set up incredibly, leaving us excited for what is to come. But is the film as magical as the spectacle it presents on screen? Kuthiraivaal revolves around Saravanan (played by a brilliant Kalaiyarasan) and his quest to find out why he suddenly wakes up with a horse’s tail, and on the way, his existence in life. Saravanan’s universe is filled with colourful characters, almost magical yet just real enough—be it his whimsical neighbour Babu (Chetan), who speaks about his love for his dog and loneliness in the same breath, or the corner-side cigar...

Maaran

Even as early as about five minutes into Maaran, it’s hard to care. The craft seems to belong in a bad TV serial, and the dialogues and performances don't help either. During these opening minutes, you get journalist Sathyamoorthy (Ramki) rambling on about publishing the ‘truth’, while it gets established that his wife is pregnant and ready to deliver ANY SECOND. A pregnant wife on the cusp of delivery in our 'commercial' cinema means that the bad men with sickles are in the vicinity and ready to pounce. Sometimes, it almost feels like they wait around for women to get pregnant, so they can strike. When the expected happens—as it does throughout this cliché-ridden film—you feel no shock. The real shock is when you realise that the director credits belong to the filmmaker who gave us Dhuruvangal Pathinaaru, that the film stars Dhanush, from whom we have come to expect better, much better. Director: Karthick Naren Cast: Dhanush, Malavika Mohanan, Ameer, Samuthirakani Stre...

Valimai

  H Vinoth's Valimai begins with a series of chain-snatching incidents and smuggling committed by masked men on bikes in Chennai. The public is up in arms against the police force, who are clueless. In an internal monologue, the police chief (Selva) wishes for a super cop to prevent such crimes. The action then cuts to Madurai, where a temple procession is underway.then we are introduced to ACP Arjun (Ajith Kumar), the film’s protagonist, whose introduction is intercut with scenes from the procession. Like a God who is held up high, we see this character rising up from the depths. In short, a whistle-worthy hero-introduction scene. We expect that Vinoth has done away with the mandatory fan service given his star's stature and will get around to making the film he wanted to make. And it does seem so for a while when Arjun gets posted to Chennai and starts investigating a suicide case that seems connected to the chain-snatching and drug-smuggling cases from before. Like in his pr...