రంగస్థలం అనే ఊళ్ళో ఉండే సాధారణ కుర్రాడు చిట్టిబాబు (రామ్ చరణ్) అదే ఊళ్ళో ఉండే రామలక్ష్మి (సమంత)ని ప్రేమిస్తాడు. ఆమె కూడ అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో ఊళ్ళో గత ముప్పై ఏళ్లుగా అధికారంలో ఉంటూ జనాల్ని దోచుకుతినే ప్రెసిండెంట్ ఫణీంధ్ర భూపతి (జగపతిబాబు) అక్రమాల్ని తట్టుకోలేక, ఊరి బాగు కోసం చిట్టి బాబు అన్న కుమార్ బాబు (ఆది పినిశెట్టి) అతనికి పోటీగా ప్రెసిండెంట్ ఎన్నికల్లో నిలబడతాడు. అన్నయ్యను గెలిపించడానికి చిట్టిబాబు కూడ కష్టపడుతుంటాడు. కానీ ఆ నామినేషన్ తో చిట్టిబాబు, కుమార్ బాబులకు తీవ్రమైన ఆపదలు తెలెత్తుతాయి. ఆ ఆపదలేంటి, అవి ఎందుకు, ఎవరి వలన ఏర్పడతాయి, వాటి మూలంగా చిట్టిబాబు ఏం కోల్పోతాడు, చివరికి ఆపదకు కారణమైన వారిపై అతను ఎలా పగ తీర్చుకుంటాడు అనేదే మిగతా కథ. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు సుకుమార్ రాసుకున్న కథాంశం, అందులోని పాత్రలు. వాస్తవికతకు చాలా దగ్గరగా ఉండే ఈ కథ, పాత్రలు సినిమాతో ప్రేక్షకుడు మమేకమయ్యేలా చేశాయి. గ్రామీణ నైపథ్యంతో తీర్చిదిద్దబడిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతూ అలరించింది. ఆరంభంలో అమాయకంగా కనిపించే చిట్టిబాబు పాత్ర...